Gossip Garage : చివరికి చిక్కీ, కోడిగుడ్లపైనా ఆయన ఫోటోలే.. జగన్ టార్గెట్‌గా లోకేశ్‌ మాస్ ర్యాగింగ్

గత ప్రభుత్వం లాగా కాకుండా విద్యావ్యవస్థను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంచాలనే తమ ఉద్దేశమని చెప్పకనే చెప్తున్నారు లోకేశ్.

Gossip Garage : చివరికి చిక్కీ, కోడిగుడ్లపైనా ఆయన ఫోటోలే.. జగన్ టార్గెట్‌గా లోకేశ్‌ మాస్ ర్యాగింగ్

Updated On : March 13, 2025 / 9:16 PM IST

Gossip Garage : ఫోటో మోజు. ఏపీలో ఇప్పుడు దీన్ని ట్రెండింగ్ టాపిక్ మారుస్తోంది కూటమి సర్కార్. వైసీపీ అధినేత జగన్‌ టార్గెట్‌గా మీ బొమ్మ మోజు ఇదంటూ తెగ ర్యాగింగ్ చేస్తోంది. ఓవైపు అసెంబ్లీ వేదికగా జగన్.. సోషల్ మీడియా వేదికగా టీడీపీ యాక్టివిస్టులు జగన్‌ను కార్నర్ చేస్తున్నారు. ఆఖరుకు పిల్లలకు అందించే కోడిగుడ్డు, చిక్కీ మీద కూడా జగన్ ఫోటో వేశారని సెటైర్ వేశారు మంత్రి లోకేశ్. కూటమి సర్కార్ ఇచ్చే స్కూల్‌ యూనిఫామ్‌ల మీద ఫోటోలు ఉండవంటూ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తోంది.

జగన్‌కు తమకు తేడా ఇదేనని చెప్పే ప్రయత్నం..
ఎన్నికలు అయిపోయాయి. ప్రభుత్వాలు మారాయ్. అనుకున్నట్లుగానే వైసీపీని ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు ఏ అంశాలనైతే ఎక్స్‌పోజ్ చేశారో ఇప్పుడు మరోసారి అలాంటి అంశాలనే కళ్లకు కట్టినట్లు ప్రజలకు వివరిస్తున్నారు కూటమి నేతలు.

గత ఐదేళ్లలో జగన్ పబ్లిసిటీ పిచ్చి పీక్‌ లెవల్‌కు వెళ్లిందని..తన ఫోటో మోజుతో అడ్డగోలుగా ఖర్చు పెట్టారంటూ విమర్శలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేశ్. తమ ప్రభుత్వం ఇచ్చే స్కూల్ యూనిఫామ్‌లు, పిల్లలకు ఇచ్చే నోట్‌ బుక్స్‌ వేటి మీద కూడా సీఎం బొమ్మ ఉండదని రివర్స్‌ గేమ్ స్టార్ట్ చేసింది. జగన్‌కు తమకు తేడా ఇదేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లోకేశ్.

Also Read : విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమా? జగన్‌తో రాజీ ముచ్చటే లేదనడానికి రీజనేంటి?

బర్ఫీ, గుడ్లపైనా జగన్ ఫోటోలే..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతీ పథకంలోనూ జగన్ మార్కు ఉండేలా చూసుకున్నారు. అయితే వైఎస్ఆర్ ఫొటో లేకపోతే జగన్ ఫొటోలు ఉండేలా ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్స్ వేశారు. జగన్ ఫోటో మోజు అంతా ఇంతా కాదని అసెంబ్లీ వేదికగా వివరించారు మంత్రి నారా లోకేశ్. ప్రభుత్వం విద్యార్థులకు అందించే స్టేషనరీ వస్తువులపైనా జగన్ ఫోటో వేయించుకున్నారని ఎక్స్‌పోజ్‌ చేస్తోంది టీడీపీ. స్కూల్ స్టూడెంట్స్‌కు ఇచ్చే పీనట్ బర్ఫీ, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, ఇంకా గుడ్లపై ఫోటోలు వేసుకోవడం మాత్రం జగన్‌కే చెల్లిందంటూ విమర్శిస్తున్నారు.

విద్యార్థులకు పంపిణీ చేసే స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్‌పై తన ఫోటోలను వేసుకున్నారని జగన్‌ను తప్పుబడుతోంది కూటమి. జగన్ ఫోటో మోజు అంటూ లోకేశ్‌ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తుండగా..వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. జగన్ ఫోటోలపై లోకేశ్ చూయించిన డిటైల్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

జగన్‌ను విమర్శించడమే కాదు.. తమ ప్రభుత్వం అసలు ఎలాంటి ఫోటోలు లేకుండా కొత్త స్కూల్ యూనిఫామ్‌ను డిజైన్‌ చేసిందంటున్నారు. ఎలాంటి రాజకీయ గుర్తులు ఉండవని..ఏ పార్టీ జెండా రంగు పోలి ఉండకుండా గ్రీన్ కలర్‌లో యూనిఫామ్‌ తయారు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం లాగా కాకుండా విద్యావ్యవస్థను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంచాలనే తమ ఉద్దేశమని చెప్పకనే చెప్తున్నారు లోకేశ్.

అయితే ఇక్కడే చంద్రబాబు సీనియారిటీ, సిన్సియారిటీని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. చంద్రబాబు అనుకుంటే జగన్ ఫోటో ఉన్న స్కీమ్‌లను బంద్ చేయొచ్చు. లేకపోతే ఆ స్కీమ్‌లపై చంద్రబాబు ఫోటోను ప్రింట్ చేయించుకోవచ్చు. కానీ చంద్రబాబు అలా చేయడం లేదంటున్నారు టీడీపీ నేతలు. ప్రజాధనాన్ని వృథా చేయకుండా, పిల్లలకు న్యూట్రిషన్‌ ఫుడ్, స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్‌ పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు.

Also Read : రాములమ్మ ఎంట్రీతో ఇబ్బందికరంగా మారింది ఎవరికి? ఏ లీడర్‌కు చెక్‌ పెట్టేందుకు తీసుకొచ్చారు?

జగన్‌కు చంద్రబాబుకు ఉన్న తేడా ఇదే అంటున్న తెలుగు తమ్ముళ్లు..
జగన్‌కు చంద్రబాబుకు ఉన్న తేడా ఇదేనని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ పాలనలో బ్యాగులు, కిట్లు అన్నింటిపై జగన్ ఫోటో ఉండే పరిస్థితికి ఇది పూర్తిగా భిన్నమంటున్నారు. ఇలా గత ప్రభుత్వ విధానాలకు క్వైట్ అపోజిట్‌ ఫార్ములాను ఫాలో అవుతూ పబ్లిక్‌ చర్చకు తెరదీస్తోంది కూటమి సర్కార్.

తాము గొప్పలకు, ప్రచార ఆర్భాటాలకు పోవడం లేదని చెప్పుకుంటున్నారు. అయితే టీడీపీ విమర్శలపై వైసీపీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. చంద్రబాబు ప్రచార పిచ్చి గురించి ప్రజలకు తెలియనిది కాదంటూ అటాక్ చేస్తోంది. దీంతో విమర్శ, ప్రతి విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.