Gossip Garage : విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమా? జగన్‌తో రాజీ ముచ్చటే లేదనడానికి రీజనేంటి?
ఇదంతా చూస్తుంటే.. విజయసాయిరెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Gossip Garage : మళ్లీ దోస్తీ చేసేది లేదు. మనసు విరిగింది. తిరిగి అతుక్కోదు. కోటరీనే కొంప ముంచింది..వాళ్ల మాట వినడం నీ తప్పే అంటూ వైసీపీ అధినేతనే టార్గెట్ చేస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తనకు అత్యంత ఆప్తుడిగా ఉన్న జగన్‌తో బ్రేకపే అంటున్నారు. తప్పంతా మీదే..చేసిందంతా మీరే..పైగా తనను బద్నాం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కీలక కేసులపై హింట్ ఇచ్చారు. అంటే విజయసాయి అప్రూవర్‌గా మారడం ఖాయమా.? జగన్‌తో రాజీ ముచ్చటే లేదు అనడానికి రీజనేంటి.?
నో కన్ఫ్యూజన్. అసలు మ్యాటర్ ఇది. క్లియర్ కట్‌గా పిక్చర్ ఏంటో ఫ్యూచర్‌లో ఇంకా చెప్తానంటూ బరస్ట్ అయిపోయారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీల విషయంలో సీఐడీ నోటీసులతో విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి.
వైసీపీని వీడినా..రాజకీయాలకు గుడ్‌బై చెప్పినా.. విజయసాయి కేసుల భయంతో ఇదంతా చేస్తున్నారని ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఆయన తనకు అత్యంత ఆప్తుడు అయిన వైఎస్ జగన్‌ను డైరెక్ట్‌గా అటాక్ చేశారు. చుట్టూ ఉన్న కోటరీ మాటలు విని జగన్ తనను దూరం చేసుకున్నారని చెప్పడమే కాదు..ఘర్ వాపసీ ఉండదని కూడా క్లారిటీ ఇచ్చేశారు.
Also Read : తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు: చంద్రబాబు
మామూలుగా అయితే పార్టీ మారిన నేతలు అధినేత సూపర్.. ఆయన చుట్టూ ఉన్న వాళ్లే వరస్ట్ అన్నట్లుగా మాట్లాడుతుంటారు. విజయసాయిరెడ్డి మాత్రం కోటరీని తిడుతూనే..వాళ్ల మాట వినడం జగన్ చేసిన పెద్ద తప్పు అన్నట్లుగా డైరెక్ట్ చేస్తున్నారు. ఆ కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి మనుషులే అని చెప్పాల్సిన అవసరం లేదంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
సీఐడీకి ఎన్ని వివరాలు చెప్పి ఉంటారోనని వైసీపీ వర్గాల్లో కంగారు..
అంతేకాదు కాకినాడ సీపోర్ట్ విషయంలో వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసేలా స్టేట్ మెంట్ ఇచ్చారు. కాకినాడ పోర్టు ఇష్యూలో కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డేనని చెప్పేశారు. లావాదేవీలన్నీ విక్రాంత్ రెడ్డే చేశాడని సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారన్నారు. కేవీరావుకు..వైవీ సుబ్బారెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి వైసీపీకి టెన్షన్ పెట్టిస్తున్నారు. కాల్ రికార్డ్స్ తీస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి బయటే ఇన్ని మాటలు చెప్పారంటే.. ఇక సీఐడీకి ఎన్ని వివరాలు చెప్పి ఉంటారోనని వైసీపీ వర్గాల్లో కంగారు మొదలైందట.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లో లిక్కర్ స్కామ్..!
పనిలో పనిగా లిక్కర్ స్కాం కథేంటో హింట్ ఇచ్చారు విజయసాయి. అదంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని అంటున్నారు. లిక్కర్ స్కాం విషయంలో తాను నిజాలు ఇక ముందు కూడా చెప్పాల్సి వస్తే మొత్తం చెబుతానని ప్రకటించారు. అప్పటి బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేంద్రంగానే..లిక్కర్ స్కాం చేశారని ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరాయని ఇప్పటికి సీఐడీ గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
వైవీ సుబ్బారెడ్డి కుమారుడే పోర్ట్ వాటాల డీల్ ను సెట్ చేశారని ఆరోపణలు..
కాకినాడ పోర్ట్ వాటాల కేసు భయంతోనే విజయసాయి వైసీపీని వీడారన్న ప్రచారం ఉంది. అయితే అదే కేసులో పార్టీ అత్యంత ముఖ్యులను కార్నర్ చేసేలా విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డే పోర్ట్ వాటాల డీల్ ను సెట్ చేశారని ఆరోపించారు.
సీఐడీ అధికారులు కూడా తనతో అదే విషయం చెప్పి ప్రశ్నించారని అంటున్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందనేలా విజయసాయి చేసిన కామెంట్స్ కూడా వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆరోపణల వరకే పరిమితమైన మద్యం కేసులో.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అంతా చేశారని చెప్పి సంచలనం సృష్టించారు విజయసాయి.
Also Read : ఒక్కొక్కరికి రూ.15వేలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి- తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ తో ఆయన అప్రూవర్ గా మారడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. కాకినాడ సీ పోర్టు వాటాల కేసులో విజయసాయిరెడ్డి A2గా ఉన్నారు. ఆయనకేం ప్రమేయం లేకపోతే విజయసాయిని సీఐడీ ఏ2గా పెట్టే అవకాశమే లేదు. పైగా లిక్కర్ స్కాం జరిగిందన్నట్లుగా స్టేట్ మెంట్ ఇచ్చేశారు విజయసాయి.
మద్యం కేసులో జగనే ఇరికిపోవడం ఖాయం?
కొత్త మద్యం బ్రాండ్ల విషయంలో జగన్ మీద టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ రెండు కేసుల విషయంలో ఫుల్ క్లారిటీతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా నిజాలు చెప్పేందుకు భయపడనని అంటున్నారు. దీంతో విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదే గనుక జరిగితే సీ పోర్టు వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డితో సహా జగన్.. మద్యం కేసులో డైరెక్ట్ గా జగనే ఇరికిపోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఆవిర్భావం దినోత్సవం.. పైగా యువత పోరు పేరుతో ఫ్యాన్ పార్టీ నిరసన చేపట్టింది. సరిగ్గా అదే రోజు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు అటెండ్ అవడం, వైసీపీని కార్నర్ చేసేలా కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతుంది. ఇదంతా చూస్తుంటే.. విజయసాయిరెడ్డి కామెంట్స్ కూటమికి అస్త్రంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.