Thalliki Vandanam : ఒక్కొక్కరికి రూ.15వేలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి- తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది పాపులేషన్ మేనేజ్ మెంట్ చేయడం కూడా ముఖ్యమైన ఉద్దేశం.

Thalliki Vandanam : తల్లికి వందనం స్కీమ్ పై సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం స్కీమ్ అమలు చేసేది ఎప్పటి నుంచో సభలో చెప్పారు. మే నెల నుంచి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామన్నారు చంద్రబాబు.
మే నుంచి తల్లికి వందనం అందిస్తామన్నారు చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ రూ.15వేలు చొప్పున అందిస్తామన్నారు. మరోవైపు పాపులేషన్ మేనేజ్ మెంట్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు పాపులేషన్ మేనేజ్ మెంట్ గురించి ఆలోచించాలన్నారు చంద్రబాబు. ఒక్కొక్కరు ఇద్దరు, ముగ్గురు పిల్లలను కనాలని సూచించారు. ఎన్ని ప్రసూతి సెలవులు కావాలని ఇస్తామని తెలిపారు. దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు చంద్రబాబు.
”ఈ మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. 15వేలు ఇస్తామన్నాం. ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ ఇస్తాం. అందులో ఎలాంటి నిబంధన ఉండదు. తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది పాపులేషన్ మేనేజ్ మెంట్ చేయడం కూడా తల్లికి వందనం స్కీమ్ ముఖ్యమైన ఉద్దేశం. నేనే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశా. మళ్లీ నేనే ముఖ్యమంత్రిగా పాపులేషన్ మేనేజ్ మెంట్ గురించి మాట్లాడుతున్నా. మారిన పరిస్థితులు అధ్యయనం చేసుకుని సమాజహితం కోసం ముందు చూపుతో ఆలోచిస్తే తప్ప సమాజానికి న్యాయం జరగదు.
Also Read : అందుకే వైఎస్ జగన్‌కు దూరం అయ్యాను.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అందుకే, దీన్ని కూడా నేను తీసుకొచ్చా. మొన్నే బిల్లు పాస్ చేశాం. ఒకప్పుడు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేశాం. ఇద్దరు పిల్లలకంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని ఒక బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. బ్రేక్ సైలెన్స్. పాపులేషన్ మేనేజ్ మెంట్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడండి. ఈ రోజు ప్రతి జంట, ప్రతి ఆడబిడ్డ ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి. ప్రతి ఒక్క ఆఫీస్ లో చైల్డ్ కేర్ సెంటర్ ఫెసిలిటీస్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read : తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు: చంద్రబాబు