Nara Lokesh: ఏపీ వ‌ర్సెస్ క‌ర్ణాట‌క‌.. కంపెనీలు, పెట్టుబడులపై రచ్చ దేనికి? వివాదం ఎక్కడ మొదలైంది?

ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని చురకలు అంటించారు.

Nara Lokesh: ఏపీ వ‌ర్సెస్ క‌ర్ణాట‌క‌.. కంపెనీలు, పెట్టుబడులపై రచ్చ దేనికి? వివాదం ఎక్కడ మొదలైంది?

Updated On : October 17, 2025 / 9:12 PM IST

Nara Lokesh: స్టేట్స్‌ అండ్ ట్వీట్స్‌ వార్ నడుస్తూనే ఉంది. ఏపీ, కర్ణాటక మినిస్టర్స్‌ మధ్య ఇన్వెస్ట్‌మెంట్స్‌పే డైలాగ్‌ వార్‌ కొనసాగుతోంది. బెంగళూరులో రోడ్లు బాలేవు..సౌకర్యాలు కల్పించడం లేదని కంపెనీల సీఈవోలు పెట్టిన పోస్టులతో వివాదం మొదలై..లోకేశ్‌ రెస్పాండ్‌తో హాట్ టాపిక్‌ అయింది. ఇప్పుడు మరోసారి గూగుల్‌ డేటా సెంటర్‌పై కర్ణాటక ఐటీ మినిస్టర్‌ చేసిన ట్వీట్‌కు లోకేశ్‌ అదే స్థాయిలో రియాక్ట్ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఫైట్‌లో మంత్రి లోకేశ్‌ సెంట్రిక్‌గా చర్చ నడుస్తోంది. అసలు కర్ణాటక, ఏపీ మధ్య ట్వీట్స్‌ వార్ ఎందుకు? వివాదం ఎక్కడ మొదలైంది?

కర్ణాటక మంత్రులు…ఏపీ ఐటీ మినిస్టర్‌ లోకేశ్‌ మధ్య ట్వీట్‌ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. బెంగళూరులో పరిశ్రమలను రన్ చేయలేకపోతున్నామని..అక్కడి నుంచి వెళ్లిపోతామంటూ పలువురు ఇండస్ట్రియలిస్టులు స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆ మధ్య చర్చకు దారితీసింది. ఇదే అదునుగా..ఏపీకి వచ్చేయండి..మీకు రెడ్ కార్పెట్ వెల్‌కమ్‌ అంటూ లోకేశ్‌ చేసిన ట్వీట్స్‌ ఆసక్తికరంగా మారాయి. బెంగళూరులో రోడ్లు, ఇతర సౌకర్యాలు, వసతులపై ఏరో స్పేస్ పార్క్, బ్లాక్ బక్ అనే పరిశ్రమ అసంతృప్తిపై గతంలోనే లోకేశ్‌ రియాక్ట్‌ అయ్యారు.

ఏరో స్పేస్‌ పార్క్‌ను అనంతపురంకు..బ్లాక్ బక్ పరిశ్రమలను విశాఖపట్నానికి తరలించాలని కోరారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో కాక రేగింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే పరిశ్రమలు ఏపీకి తరలిపోతున్నాయని అక్కడి విపక్షాలు సిద్దరామయ్య సర్కార్‌పై అటాక్ స్టార్ట్‌ చేయడంతో..15 రోజుల క్రితం పెద్ద రచ్చే అయింది. అప్పటినుంచే ఏపీ, కర్ణాటక మంత్రుల మధ్య ట్వీట్‌ వార్‌ మొదలై..ఈ మధ్య కాస్త చల్లబడింది.

ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు పెరిగాయని ట్వీట్..

ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక్‌ ఖర్గే చేసిన కామెంట్స్‌ చర్చకు దారి తీస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా రాయితీలు ఇచ్చి గూగుల్ డేటా సెంటర్‌ను ఏపీకి తెచ్చుకుందన్నారాయన. అన్ని రాయితీలు ఇస్తే ఏ రాష్ట్రం అయినా పెట్టుబడులు తెచ్చుకోవచ్చన్నారు. అంతేకాదు ఏపీ అప్పులు ఇప్పుడు దాదాపు రూ.10 లక్షల కోట్లకు పెరిగాయని, కేవలం ఒక సంవత్సరంలోనే రూ.లక్షా 61 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకున్నారని కూడా ప్రియాంక్‌ ఖర్గే ట్వీట్ చేశారు.

ఆంధ్రా ఫుడ్‌ స్పైసీగా ఉంటుందని..ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కాస్తంత ఘాటు ఉన్నా.. దాన్ని ఆస్వాదిస్తారు. కానీ పోషకాహార నిపుణులు ఆహారంలో సమతుల్యత ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఆర్థికవేత్తలు కూడా బ్యాలెన్స్‌డ్‌ బడ్జెట్‌ను మెయింటేన్ చేయాలని చెబుతున్నారంటూ ప్రియాంక్‌ ఖర్గే తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌..ప్రియాంక్ ఖర్గేకు కౌంటర్ ఇచ్చారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడంపై పొరుగు రాష్ట్రాల్లో అలజడి మొదలైందన్నారు. ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని చురకలు అంటించారు. పొరుగువారికి ఇప్పటికే ఆంధ్రా కారం ఘాటు సెగ తగులుతుందని లోకేశ్‌ ఇచ్చి పడేశారు.

ఈ ట్వీట్‌ వార్‌ లో ఏపీ ఐటీ మినిస్టర్‌ చుట్టూ చర్చ జరుగుతోంది. ఏపీకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ తేవడంలో లోకేశ్‌ కీరోల్ ప్లే చేస్తున్నట్లుగా ఆయనకు హైప్ క్రియేట్ అవుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇద్దరిలో ఎవరూ కూడా కర్ణాటక మంత్రుల ట్వీట్స్‌పై రియాక్ట్ కావడం లేదు. ప్రియాంక్‌ ఖర్గే అయినా..డీకే శివకుమార్‌ వ్యాఖ్యలు చేసినా..లోకేశే వారికి కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ఐటీ మినిస్టర్‌గా లోకేశ్‌ పెట్టుబడులు తెస్తుంటే..కర్ణాటక మంత్రులు అడ్డుకుంటున్నారని..జనాల్లో చర్చ జరుగుతోంది.

లోకేశ్‌ సెంట్రిక్‌గా నేషనల్ మీడియాలోనూ డిస్కషన్..

గూగుల్‌ డేటా సెంటర్‌ అగ్రిమెంట్‌ నుంచి..ఇటు ఏపీలో విపక్ష వైసీపీ విమర్శల దాక..అటు కర్ణాటక మంత్రుల ట్వీట్స్‌తో లోకేశ్‌ సెంట్రిక్‌గా డిస్కషన్ నడుస్తోంది. అటు ఐటీ ఫీల్డ్‌లోనూ..ఇటు ఏపీ పబ్లిక్‌లోనూ..నేషనల్ మీడియాలోనూ లోకేశ్‌ ట్వీట్స్‌పై డిస్కషన్ నడుస్తోంది. గూగుల్‌ డేటా సెంటర్‌ రాక సందర్భంగా ఎంతగా ప్రచారం చేసుకోవాలో అంతకంటే ఎక్కువే మైలేజ్‌ పొందే ప్రయత్నం చేస్తోంది కూటమి. పైగా బెంగళూరులో రోడ్లు, సౌకర్యాలు, వసతుల సరిగ్గా లేవని కంపెనీల సీఈవోలు చేస్తున్న ట్వీట్లను లోకేశ్‌ ప్లస్‌ పాయింట్‌గా మార్చుకోవడంతో..ఓవరాల్‌ ఎపిసోడ్‌లో ఏపీ ఐటీ మినిస్టర్ లోకేశ్‌ హైలెట్‌ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కర్ణాటక మంత్రులు, ఏపీ మినిస్టర్ లోకేశ్‌ మధ్య ట్వీట్‌ వార్‌కు ఎండ్‌ కార్డ్ పడేదెప్పుడో చూడాలి.

Also Read: ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్..! గ్రౌండ్‌లోకి దిగిపోతున్న సీఎం చంద్రబాబు.. అసలు కూటమి ముందస్తు ప్లానేంటి?