ఏపీకి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకోగా.. ఆ సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇక, ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.

ఏపీకి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

Government Key Decision (Photo Credit : Google)

Updated On : June 6, 2024 / 12:05 AM IST

Ap Government : ఏపీకి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. డెప్యుటేషన్‌పై వచ్చి పని చేస్తున్న పలువురు అధికారులు రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. మాతృ సంస్థకు వెళ్తానని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవర రెడ్డి దరఖాస్తు చేశారు.

ఏపీ నుంచి రిలీవ్ చేయాలని గనులశాఖ ఎండీ వెంకటరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని సమాచారశాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌ రెడ్డి కోరారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలంగాణకు వెళ్తానని కోరారు. తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు ప్రభుత్వానికి అప్లయ్ చేసుకున్నారు.

కాగా.. డెప్యుటేషన్‌పై వచ్చిన వారిపై గతంలో టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఎవరికీ సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకోగా.. ఆ సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇక, ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.

Also Read : జగన్ ఘోర ఓటమికి, చంద్రబాబు ఘన విజయానికి ప్రధాన కారణాలివే- మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు