AP Assembly Budget Session : ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే.. వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.

AP Assembly Budget Session : ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే.. వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు

AP Governor Abdul Nazeer

Updated On : February 7, 2024 / 4:18 PM IST

AP Governor Abdul Nazeer : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

Also Read : TDP MLAs Protest : ఏపీ అసెంబ్లీ వద్ద ఉధ్రిక్తత.. బారికేడ్లను తోసుకొని అసెంబ్లీ లోపలికి వెళ్లిన టీడీపీ సభ్యులు

  • రైతు సంక్షేమమే ధ్యేయం..
    ఉచిత పంటల బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్ల క్లెమ్లలు 3 చెల్లించాం.
    వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 73.88 లక్షల మందికి రూ.1833 కోట్ల రుణాలిచ్చాం.
    వైఎస్ఆర్ రైతుభరోసా – పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి ప్రతి రైతుకి రూ.13,500 చొప్పున ఇప్పటివరకు 53.53 కోట్ల మందికి రూ.33,300 కోట్లు చెల్లించాం.
  • ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం..
    ఏపీలో 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేశాం.
    1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాం.
    ఇప్పటివరకు 53,126 మంది సిబ్బందిని నియమించాం.
    ఫ్యామిలీ డాక్టర్ విధానం కింద 3.03 కోట్ల ఓపీ సేవలు అందించాం.
    1.3 కోట్ల గ్రామీణ రోగులకు ఇంటివద్దే వైద్య సేవలు కల్పించాం.
    ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా సురక్ష అమలు చేశాం’ అని తెలిపారు.
  • విద్యలో విప్లవాలు సృష్టించాం ..
    దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యా సంస్కరణుల తీసుకొచ్చాం.
    పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ ను అందిస్తున్నాం.
    వచ్చే ఏడాది నుంచి 1వ తరగతికి IB విధానం అమలు చేస్తాం.
    నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తాం.
    విద్యారంగంపై రూ. 73వేల కోట్లు ఖర్చు చేశాం.
    1-10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అందిస్తున్నాం.ఇందుకు ఏటా రూ.1910 కోట్లు ఖర్చు పెడుతున్నాం.

 

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్..
అసెంబ్లీ హాల్ లో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. గవర్నర్ ప్రసంగంకు అడ్డుపడుతూ తప్పులతడకగా ఉందంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేస్తూ.. గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించేప్రయత్నం చేశారు. దీంతో మార్షల్స్ టీడీపీ సభ్యులను అడ్డుకున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇదిలాఉంటే బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 7వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్, 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.