Biswabhusan Harichandan : ఆంధ్ర గవర్నర్ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్
గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.

TS Gov Visit AP GOV
Biswabhusan Harichandan: గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు. ఈరోజు ఉదయం అస్వస్ధతకు గురైన బిశ్వ భూషణ్ హారిచందన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చి గవర్నర్ ఆరోగ్య పరిస్ధితిని గురించి ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతోందని… బిశ్వ భూషణ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా అని తమిళిసై అన్నారు.