YSRCP: వైసీపీలో గ్రూపు రాజకీయాలు.. ఎక్కడెక్కడంటే?
ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. మూడు చోట్ల కేకులు..

Roja
Roja: నగరి వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రి రోజాతో సంబంధం లేకుండా వైసీపీ నేతలు విడివిడిగా సీఎం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేజే కుమార్, కేజే శాంతి దంపతులు పుత్తూరులో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఇటీవల నగరి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి రోజా, కేజే శాంతి మధ్య మళ్లీ స్నేహాన్ని చిగురింపజేయడానికి జగన్ ప్రయత్నించారు. సీఎం చొరవ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. ఏపీ ఎన్నికల వేళ కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోనూ..
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజక వర్గం వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. మూడు చోట్ల కేకులు కట్ చేశారు.
ఏపీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టికెట్ విషయంలో పలు రకాలుగా ప్రచారం జరుగుతోన్న వేళ వైసీపీలో మూడు గ్రూపులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇందులో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక వర్గం.
అలాగే, పుట్టపర్తి టికెట్ ఆశిస్తున్న సోమశేఖర్ రెడ్డి, నాగేంద్ర కుమార్ రెడ్డి వేర్వేరుగా గ్రూపు రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి మద్దతు ఇస్తే ఏమవుతుందోనని వైసీపీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
YS Jagan : కృష్ణా వైసీపీలో నేతల టెన్షన్.. ఐదుగురు సిట్టింగుల సీట్లు గల్లంతయ్యే ఛాన్స్..!