టీటీడీ లడ్డూపై అందుకే విష ప్రచారం చేశారు: అమర్‌నాథ్‌

హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొందని తెలిపారు.

టీటీడీ లడ్డూపై అందుకే విష ప్రచారం చేశారు: అమర్‌నాథ్‌

gudivada amarnath

Updated On : September 29, 2024 / 4:54 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

ఇవాళ ఆయన విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెట్టడానికి టీటీడీ లడ్డూపై విషప్రచారం చేశారని విమర్శించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొందని తెలిపారు.

పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, గుడ్లవల్లేరు కాలేజీ విద్యార్థినులు ధర్నా చేస్తే వాళ్లను కూడా భయపెట్టారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారని చెప్పారు. కూటమి నేతలు రాష్ట్రంలో ఇన్ని చర్యలకు పాల్పడుతూ సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుఉన్నారని అన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ.. ఏం జరగనుంది, దేశవ్యాప్తంగా ఉత్కంఠ..