Rates to funerals :కరోనాతో చనిపోతే.. రూ. 5,100, మామూలుగా చనిపోతే రూ. 2,200 : కరోనా కాలంలో శ్మశానంలో ధరల పట్టిక

శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైతే ఇంత అంటూ ధరల పట్టిక ఒకటి రాసి శ్మశానం ముందు ఏర్పాటు చేసిన వింత ఘటన ఏపీలో చోటుచేసుకుంది. జరిగింది. ఈ బోర్డు చూసినవాళ్లంతా ‘కలికాలం’ అనే మాటకు బదులుగా ‘కరోనా కాలం’ అని ముక్కున వేలు వేసుకుంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు.

Rates to funerals :కరోనాతో చనిపోతే.. రూ. 5,100, మామూలుగా చనిపోతే రూ. 2,200 : కరోనా కాలంలో శ్మశానంలో ధరల పట్టిక

Guntur Graveyard Decided Rates To Funerals In Ap

Updated On : May 10, 2021 / 5:07 PM IST

graveyard decided rates to funerals : ధరల పట్టిక అనేది హోటల్స్ లోను..కిరాణా షాపుల్లోను..టిఫిన్ సెంటర్ల వద్ద చూస్తుంటాం.కానీ శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైతే ఇంత అంటూ ధరల పట్టిక ఒకటి రాసి శ్మశానం ముందు ఏర్పాటు చేసిన వింత ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ బోర్డు చూసినవాళ్లంతా ‘కలికాలం’ అనే మాటకు బదులుగా ‘కరోనా కాలం’ అని ముక్కున వేలు వేసుకుంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు.

గుంటూరు నగంలోని ఓ శ్మశాన వాటిక అంత్యక్రియలకు ధరలు ఫిక్స్ చేశాయి. శ్మశానం ముందు ఉన్న బోర్డుమీద తాటికాయంత అక్షరాలతో ఇలా రాసి ఉంది. ‘‘కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు చేయాలంటే రూ. 5,100, సాధారణ మరణానికైతే రూ. 2,200 చెల్లించాలని పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక గోడలపై రాశారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలోని ఒక్కో శ్మశాన వాటికలో ఒక్కోలా వసూలు చేస్తున్నారని..దీంతో శ్మశాన వాటికల నిర్వాహకులతో చర్చించి ఉన్నతాధికారులు ఈ ధరలు నిర్ణయించారని నగర పాలక కొవిడ్ మరణాల పర్యవేక్షణాధికారి తెలపటం విశేషమైతే..ఈ ధర పట్టిక గురించి నగర పాలక సంస్థకు సంబంధం లేదని కమిషనర్ అనురాధ చెప్పడం గమనించాల్సిన విషయం. ఆయా శ్మశాన వాటికల కమిటీల ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని..ప్రజల సౌకర్యార్థం అంత్యక్రియల ఖర్చులను బోర్డులపై ఏర్పాటు చేయాలని ఆదేశించామని..అయితే పాత గుంటూరు శ్మశాన వాటిక వద్ద బోర్డు రాయించటంలో పొరపాటు జరిగి ఉంటుందని తెలిపారు.

కరోనాతో చనిపోయినవారి బంధువులు పట్టించుకోకపోయినా అటువంటి మృతదేహాలకు అంత్యక్రియల బాధ్యత నగరపాలక సంస్థదేనని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకంటామని అనురాధ హెచ్చరించారు. కాగా కరోనాతో చనిపోయినవారి మృతదేహాలకు దహన సంస్కారాలను అవసరమైతే ఉచితంగా చేయాలని ప్రభుత్వం ఓ పక్కన చెబుతోంది. కానీ నగర పాలక వర్గాలు మాత్రం వారి ఇష్టానుసారంగా చేయటంపఃనా..ధరలు నిర్ణయించడంపై నగర వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.