Half day Schools in AP : ఏపీలో ఒంటి పూట బడులు..ఎప్పటినుంచి అంటే..

ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి. దీంతో ఏపీ స్కూళ్లు ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Half day Schools in AP : ఏపీలో ఒంటి పూట బడులు..ఎప్పటినుంచి అంటే..

Half Day Schools Start From April 4th In Andhra Pradesh

Updated On : April 1, 2022 / 2:54 PM IST

Half day Schools in AP : ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే మే నెల ఎండల్లా మండిపోతున్నాయి.ఉదయం తొమ్మిది గంటలకే రోడ్డు ఎక్కాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. భానుడి భగభగల ధాటికి తట్టుకోలేక పెద్దవారే బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్ కు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించనున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం (ఏప్రిల్ 1,2022)న వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. స్కూల్ టైమింగ్ ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు స్కూల్స్ నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.