ఏపీలో నాలుగు రోజులు వర్షాలు.. ఇవాళ ఏఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందంటే?

ఆదివారం రాత్రి ఏపీలోని 43 ప్రాంతాల్లో 64.5-115.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో

ఏపీలో నాలుగు రోజులు వర్షాలు.. ఇవాళ ఏఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందంటే?

Heavy Rains

Updated On : June 3, 2024 / 7:36 AM IST

AP Rains Alert : ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఏపీ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులు పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది.

Also Read : Heavy Rains Alert : తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. బయటకు రావొద్దు.. జాగ్రత్త!

ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఏపీలో ఇవాళ.. పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

Also Read : IMD Issues Yellow Alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

ఆదివారం రాత్రి ఏపీలోని 43 ప్రాంతాల్లో 64.5-115.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125.7మి.మీ, నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2మి.మీ, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 106.2మి.మీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 205 ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో 15.6-64.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.