ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ఎందుకంటే?

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ఎందుకంటే?

Updated On : October 23, 2025 / 8:46 AM IST

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల్లో స్కూళ్లు తెరుచుకోవు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురవడంతో నిన్న కూడా నెల్లూరు జిల్లాలో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ప్రజలకు సమస్యలు ఎదురైతే 0861- 2331261, 7995576699 నంబర్లకు కాల్ చేసి చెప్పొచ్చని తెలిపారు.

Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. మారనున్న మురికివాడల రూపురేఖలు

ఏపీలో మరో 5 రోజులు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. శనివారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపారు.