Heavy Rains: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

Nellore
Heavy Rains: భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోగా.. బుధవారం(10 నవంబర్ 2021) రాత్రి మొదలైన వర్షం.. శుక్రవారం అర్ధరాత్రి వరకూ తగ్గలేదు. నదులు, కాలువలు, చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గాలుల తీవ్రత ఎక్కువ కావడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా.. జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో 10 నుంచి 18 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.
సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, విడవలూరు, కావలి ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. కాళంగి, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేటలో పాముల కాలువ, పుచ్చా కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేటలోని వట్ర పాలెం, సూళ్లూరు ఎస్టీ కాలనీలు జలదిగ్బంధంలో నిండిపోగా.. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మనుబోలు పెద్ద చెరువు, సైదాపురం కలిచేడు చెరువులకు గండ్లు పడి రాకపోకలు నిలిచిపోయాయి.
Bigg Boss 5 : కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కలిసొచ్చి బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా రవి
సంగం ఆనకట్టపై పెన్నా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విడవలూరులో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. సంగoలో చేనేత మగ్గాల గుంతల్లోకి వర్షపు నీరు చేరింది. సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 84వేల 906 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 88వేల 62క్యూసెక్కులుగా ఉంది.
TSRTC : ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లకు హెచ్చరికలు, భారీ జరిమాన..ఒప్పందం రద్దు!
జలాశయం నుంచి ఏడు గేట్లు ఎత్తి పెన్నానది నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయం పూర్తి నీటి మట్టం 77.988 టీఎమ్‌సీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 72,492టీఎమ్‌సీలుగా ఉంది. వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్‌కు కూడా భారీగా వరద నీరు చేరుతుంది.