Padayatra : అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరుతో 47 రోజుల పాటు అమరావతి రైతులు పాదయాత్రకు పిలుపునివ్వగా.. శాంతి

Padayatra : అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Padayatra

Updated On : October 29, 2021 / 4:33 PM IST

Padayatra : అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరుతో 47 రోజుల పాటు అమరావతి రైతులు పాదయాత్రకు పిలుపునివ్వగా.. శాంతిభద్రతల దృష్టా పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ నిన్న చెప్పారు. దీనిపై రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, పోలీసుల అనుమతి నిరాకరణకు సరైనా కారణాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది.

Cooked Vegetables : ఉడికించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదేనా?..

అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో అమరావతి నుంచి తిరుమలకు మహాపాదయాత్ర చేయబోతున్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు ప్రకటించారు. యాత్రలో భాగంగా.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను గ్రామగ్రామాన ప్రజల దగ్గర ఎండగడతామంటున్నారు.

పాదయాత్రలో అన్ని వర్గాలనూ కలుపుకుని వెళతామని, ఇప్పటికే అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వాన పత్రాలు అందించినట్లు తెలిపారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు, జనసేన, సీపీఐ, సీపీఎం మద్దతును తెలిపాయి. కొన్ని కారణాలతో ఉద్యమానికి దూరంగా ఉన్న దళిత జేఏసీ నేతలు కూడా.. మహాపాదయాత్రలో పాల్గొంటామన్నారు.

Vitamin Deficiency : ఆ.. విటమిన్ లోపిస్తే… మతిమరుపు, గుండె సమస్యలు..!

నవంబరు 1న మొదటి రోజు తుళ్లూరు నుంచి తాడికొండ వరకు పాదయాత్ర సాగుతుంది. అక్కడి నుంచి తాడికొండ, గుంటూరు అమరావతి రోడ్డు, పుల్లడిగుంట, ఏటుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, అలిపిరి మార్గం గుండా తిరుమలకు యాత్ర చేరుకుంటుంది. తమ పాదయాత్రకు అందరూ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.