High Court : శ్రీవారి భక్తులకు హైకోర్టులో చుక్కెదురు.. టీటీడీ కల్పించిన దర్శనం చేసుకోవాలని ఆదేశం

కొందరు భక్తులు టీటీడీ కల్పించిన దర్శనం చేసుకున్నారు. మరి కొందరు భక్తులు ఆర్జిత సేవ టికెట్ల మొత్తాన్ని వెనక్కు తీసుకున్నారు.

High Court : శ్రీవారి భక్తులకు హైకోర్టులో చుక్కెదురు.. టీటీడీ కల్పించిన దర్శనం చేసుకోవాలని ఆదేశం

High Court Srivari Devotees

High Court Srivari Devotees : తిరుమల శ్రీవారి భక్తులకు హైకోర్టులో చుక్కెదురైంది. టీటీడీ కల్పించిన దర్శనం చేసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ఆర్జిత సేవ టికెట్ల భక్తుల పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 సమయంలో ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు అవకాశం కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్నా మిగిలిన భక్తులకు కల్పించిన సదుపాయలనే ఉపయోగించుకోవాలని పిటిషనర్లను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.

కోవిడ్-19 కారణంగా టీటీడీ భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేసింది. మేల్ చాట్ వస్త్రం, అభిషేకం సహా ఇతర ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులు టికెట్ సొమ్ము వెనక్కి తీసుకోవడమో లేదా టీటీడీ కల్పించే దర్శనం సదుపాయం ఉపయోగించుకునే వీలు కల్పించింది.

Tirumala: అలా చేయొద్దు.. తిరుమల కొండపైకి నడక మార్గంలో ప్రయాణించే భక్తులకు టీటీడీ కీలక సూచన..

కోవిడ్ -19 కారణంగా సుమారు 16 వేల మంది భక్తులు ఆర్జిత సేవలో పాల్గొనలేకపోయారు. కొందరు భక్తులు టీటీడీ కల్పించిన దర్శనం చేసుకున్నారు. మరి కొందరు భక్తులు ఆర్జిత సేవ టికెట్ల మొత్తాన్ని వెనక్కు తీసుకున్నారు. కాగా, 16 మంది భక్తులు ఆర్జిత సేవలో పాల్గొనేలా టీటీడీని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు.