AP And Odisha : సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ

దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముందడుగు వేశాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం నిర్దేశించుకున్నాయి.

AP And Odisha : సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ

Ap And Odisha

Updated On : November 10, 2021 / 8:16 AM IST

AP And Odisha : దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముందడుగు వేశాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం నిర్దేశించుకున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఇరు  రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒడిశా అభ్యంతరాలతో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలపై నవీన్‌ పట్నాయక్‌తో సీఎం జగన్ చర్చించారు.

Read More : Tombs : తెల్లారేసరికి వ్యవసాయ భూమిలో సమాధులు

పోలవరంపై ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై సీఎం జగన్ చర్చలు జరిపారు. ముంపునకు గురువుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలపై జగన్ కీలక సూచనలు చేశారు. బహుదానది నీటి విడుదలపై సమాలోచనలు జరిపారు. బలిమెల, ఎగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఎన్‌ఓసి అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, గంజాయి నియంత్రణకు  సహకారంతో పాటు కలసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అంగీకారం తెలిపారు.

Read More : India Petrol : స్థిరంగా చమురు ధరలు, ఏ నగరంలో ధర ఎంతంటే ?

అలాగే ఇరు రాష్ట్రాల మధ్య సోదర భావం పెంపొందించేందుకు ఒడిశా సరిహద్దు జిల్లాలో తెలుగు, ఏపీ సరిహద్దు జిల్లాలో ఒడిశాకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని సీఎంలు నిర్ణయించారు. ఈ దిశగా అడుగులు వేయడానికి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా చర్యలు చేపట్టనున్నారు.