వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత

గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొడాలి నాని ఇంటిపై..

వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత

Updated On : June 7, 2024 / 7:33 PM IST

Vallabhaneni Vamsi Mohan : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో వంశీ నివాసం ఉంటున్న ఓ అపార్ట్ మెంట్ లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వంశీ బయటకు రావాలి అంటూ నినాదాలు చేశారు. వంశీని వదిలేది లేదంటూ హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వంశీ ఇంటి దగ్గర భద్రత పెంచారు.

మరోవైపు గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు విసిరాయి. దీంతో పోలీసులు కొడాలి నాని ఇంటి దగ్గర భద్రత పెంచారు.

దేవినేని అవినాశ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు
విజయవాడలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాశ్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉదయం కొడాలి నాని ఇంటి వద్ద, మధ్యాహ్నం విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినాశ్ ఇంటి వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసులను మోహరించి ఇనుప కంచెను ఏర్పాటు చేశారు.

Also Read : కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరిన టీడీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత