Visakha Dairy : విశాఖ డెయిరీలో అక్రమాల ఆరోపణలపై విచారణ ముమ్మరం..

ఏవైతే సందేహాలు, అనుమానాలతో వచ్చామో.. వాటిని నివృత్తి చేసుకోవడం కన్నా అవి ఇంకా ఎక్కువయ్యాయి.

Visakha Dairy : విశాఖ డెయిరీలో అక్రమాల ఆరోపణలపై విచారణ ముమ్మరం..

Updated On : December 9, 2024 / 4:40 PM IST

Visakha Dairy : విశాఖ డెయిరీ అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వ హౌస్ కమిటీ విచారణ కొనసాగుతోంది. విశాఖ డెయిరీ అధికారులతో ప్రభుత్వ హౌస్ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. హౌస్ కమిటీ ఛైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యులు బోండా ఉమా, పల్లా శ్రీనివాస్, గౌతు శిరీష చర్చించారు. డెయిరీలో పరిస్థితులు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయని జ్యోతుల నెహ్రూ అన్నారు. హౌస్ కమిటీ వచ్చినా డెయిరీ ఛైర్మన్ అందుబాటులో లేరని చెప్పారు. పాడి రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. మరికొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నారు.

‘యాజమాన్యంతో మాట్లాడితే.. మేమేమీ డబ్బులు తగ్గించడం లేదు అని అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది. పాల ధర చూస్తే తగ్గించారు. మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు వచ్చి మాకు ఫిర్యాదు చేశారు. దానిపై మేము అడిగితే.. ఒక్క పైసా కూడా తగ్గించలేదని యాజమాన్యం అంటోంది. ఇది మరింత అనుమానానికి దారితీసింది. ఏవైతే సందేహాలు, అనుమానాలతో వచ్చామో.. వాటిని నివృత్తి చేసుకోవడం కన్నా అవి ఇంకా ఎక్కువయ్యాయి. కచ్చితంగా డెయిరీకి మరోసారి రావాల్సిన అవసరం ఉంది’ అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు.

‘ఇక్కడ ఉన్న ప్లాంట్ అధికారులు, జిల్లా అధికారులతో కలిసి డెయిరీ యాజమాన్యంపై వచ్చిన ఆరోపణలపై చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో ఏం వచ్చిందని మీరు అడగొచ్చు. మరిన్ని సందేహాలు వచ్చాయి. చర్చల్లో యాజమాన్యం ఇచ్చిన సమాధానం చూస్తే వచ్చినటువంటి ఆరోపణలకంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమీ క్లారిటీ రాలేదు’ అని హౌస్ కమిటీ ఛైర్మన్ జోత్యుల నెహ్రూ అన్నారు.

 

Also Read : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య.. టీడీపీ నుంచి ఎవరంటే?