ఏపీ ప్రభుత్వం.. దిశ కేసులపై 7 రోజుల్లోగా ఎలా విచారణ పూర్తి చేస్తుందంటే?

చిన్నారుల భద్రత, మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దిశ చట్టం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. మహిళలపై అత్యాచార ఘటనలు జరిగినప్పుడు అతి తక్కువ సమయంలో విచారణ పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం కొత్త దిశ అప్లికేషన్ తీసుకొచ్చింది.
ఈ అప్లికేషన్ ద్వారా నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసిన తర్వాత కేవలం ఏడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి వారికి శిక్ష పడేలా చేయడమే దీని ఉద్దేశం. అయితే.. ఏదైనా హత్యా లేదా అత్యాచార ఘటన జరిగితే విచారణ పూర్తి చేయడానికి చాలా రోజుల సమయం పడుతోంది. ఇకపై అలా కాకుండా కేవలం ఏడు రోజుల్లోనే కేసు విచారించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది.
14 పనిదినాల్లోగా దర్యాప్తు పూర్తి :
అసలు.. ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యమేనా? అంటే అవునంటోంది.. విచారణ పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను అన్నింటిని దిశ చట్టంలోకి చేర్చినట్టు చెబుతోంది. దిశ చట్టంలోని ప్రత్యేకతలపై ఏపీ ప్రభుత్వం, ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే.. రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఐపీసీ 354F, 354G సెక్షన్లను అదనంగా చేర్చింది. పోక్సో, గ్యాంగ్ రేప్ వంటి కేసుల్లో ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామంటోంది. 14 పనిదినాల్లోగా విచారణ పూర్తి చేయనుంది. నిర్భయ వంటి కేసుల్లో కూడా ఇదే సమయంలోగా విచారణ పూర్తి చేస్తుంది. దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.
13 దిశా కోర్టులు.. 13 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం :
ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 13 దిశ కోర్టులు, 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియమించనుంది. విచారణ కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తోంది. ఏదైనా కారణాల రీత్యా రెండు నెలల వరకు సమయం పట్టొచ్చు. ఒక విచారణ పూర్తి చేసి దానిపై ఛార్జ్ షీటు వేయాలంటే స్టేట్ హోల్డర్ల నుంచి కొన్ని రిపోర్టులు రావాల్సి ఉంటుంది.
ఎమ్మార్వో, మెడికల్ రిపోర్టు, ఎడ్యుకేషన్, డాక్టర్ల దగ్గర నుంచి రిపోర్టులు రావాల్సి ఉంటుంది. ఆ టైమ్ పిరియడ్ ను ఏడు రోజులకు తీసుకురావాలని దిశా చట్టంలో పొందుపరిచారు. ఇందుకోసం 87కోట్ల రూపాయలను సీఎం జగన్ విడుదల చేశారు. స్పెషల్ కోర్టులను 13 ఏర్పాటు చేయాలని, 13 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్పీల్ టైమ్.. 180 రోజుల నుంచి 45కు కుదింపు :
14 రోజుల్లో ట్రయల్ కంప్లీట్ కావాలంటే.. రోజువారీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ అప్పీల్ టైమ్.. 180 రోజుల సమయం ఉండగా.. 45 రోజులకు కుదించడం జరిగింది. రేప్, గ్యాంగ్ రేప్ నేరాలకు పాల్పడితే మరణ శిక్ష విధించడం.. జీవిత ఖైదు శిక్షలు వేయడం.. ఫస్ట్ టైం ఇండియాలో డిజిటల్ మీడియాలో మహిళలు భౌతికంగా, వర్చువల్ సేఫ్ గా లేని పరిస్థితుల్లో సరైన చట్టాలు లేదు.. దిశా చట్టం ప్రకారం.. తొలిసారి నేరం చేస్తే 2 ఏళ్లు, రెండోసారి వేధింపులకు పాల్పడితే 4 ఏళ్ల వరకు శిక్ష పడొచ్చు.
దిశా FSL, సైబర్ ల్యాబ్స్, డీఎన్ఏ తిరుపతి విశాఖపట్నంలో రావడం, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్ రావాల్సి ఉంది. దిశా పోలీసు స్టేషన్ లో ఒక డీఎస్పీ ఉండేవారు.. ఇప్పుడు అదనంగా డీఎస్పీ పోస్టును మంజూరు చేయడం జరిగింది. ముగ్గురు ఎస్సైల పోస్టులను మంజూరు చేయనుంది. ప్రతిఏడాదిలో 600 వరకు అత్యాచారాలు… 13000 వరకు పోక్సో యాక్ట్ కేసులు నమోదు అవుతున్నాయి. అంటే.. మొత్తం 1800 కేసులు విచారించాల్సి ఉంటుంది.
18 దిశ పోలీసు స్టేషన్లు.. దిశ వాహనాలు :
అప్పుడు ఒక జిల్లాలో ఒక దిశ పోలీసు స్టేషన్ లో 100 కేసులు మాత్రమే విచారించాల్సి ఉంటుంది. అంటే.. ఇన్విస్టిగేషన్ అధికారికి కేవలం 20 కేసులు మాత్రమే ఉంటాయి. ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేయడానికి వీలు పడుతుంది.. ఇక్కడ విచారణలో క్వాలిటీ పెరుగుతుంది.. స్టేట్ హోల్డర్ల నుంచి సాయం పొందడానికి సమయం పడుతుంది.. దిశ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూమ్స్, డయల్ 100, 112 రెండు ఉన్నాయి. వీటితో పోలీసుల సాయం అందిస్తుంది.. రెండింటిని కలిపి ఇంటిగ్రేట్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు.
దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. దిశ వాహనాలు కూడా ఏర్పాటు చేస్తోంది. క్లూస్ టీం మేనేజ్ మెంట్.. క్రైం సీన్ కు వెళ్లేందుకు మినీ బస్సులను కూడా ఏర్పాటు చేస్తోంది. మినీ బస్సులో బాధితులతో ప్రత్యేకంగా ఒక చాంబర్ ఏర్పాటు చేసి కౌన్సిలర్ వారితో మాట్లాడి స్టేట్ మెంట్ రికార్డు చేస్తారు. క్లూస్ టీం క్రైం సీన్ దగ్గరకు వెళ్లి అక్కడి దొరికే ఆధారాలను టైం పిరియడ్ కంజ్యూమ్ కాకుండా ముందుగానే సేకరిస్తారు.
జోరో ఎఫ్ఐఆర్… నమోదు చేయకపోతే :
జోరో ఎఫ్ఐఆర్.. వల్ల లాభం ఏంటంటే.. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు.. ఏ పోలీసు స్టేషన్లో లైనా బాధితురాలు తన బాధను చెప్పుకుని ఎఫ్ ఐఆర్ నమోదు చేయించుకోవచ్చు. ఈ జీరో ఎఫ్ఐఆర్ ఎవరైతే అమలు చేయారో వారిపైనా ఐపీసీ సెక్షన్ల కింద శిక్షలు ఖరారు చేస్తారు.. 166A కింద ఏ పోలీసు అధికారి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయరో వారిపైనా క్రిమినల్ సెక్షన్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 62 జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. అదేవిధంగా దిశ వాహనాలను జిల్లాల్లో ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటలకు ఏ మహిళ అయిన సురక్షితంగా ఇంటికి చేరేందుకు ఈ డ్రాపింగ్ వాహనాలు పనిచేస్తుంటాయి. ఉచితంగా ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
ఒక బటన్ నొక్కితే.. కంట్రోల్ రూంకు సమాచారం :
ఇక దిశ మొబైల్ అప్లికేషన్.. SOS యాప్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒక బటన్ తో పోలీసుల సేవలు.. ముఖ్యంగా మహిళలకు అందుబాటులోకి వచ్చేలా ఈ యాప్ తీసుకొచ్చారు. ఆ కాలర్ SOS బటన్ నొక్కితే.. పది సెకన్ల ఆడియో వీడియో కట్ అయి కంట్రోల్ రూంలోకి వెళ్తుంది. బాధితురాలు మాట్లాడలేని పరిస్థితులో ఉంటే.. స్టేక్ చేసినా ఆ ట్రిక్కర్ కంట్రోల్ రూంకు చేరుతుంది. అవసరమైన అన్ని SOS ఫీచర్లన్ని ఇంటిగ్రేట్ చేసి దిశ అప్లికేషన్ రూపొందించారు. ఇందులో మెడికల్ ఎమర్జెన్సీ కూడా యాడ్ చేసింది.
అందులోని మ్యాప్స్ ఆధారంగా బ్లడ్ బ్యాంకు, మెడికల్ ఫెసిలిటీ ఇలా అన్ని సర్వీసులను వినియోగించుకోవచ్చు. దిశ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అడ్వాన్స్ డ్ ఇన్విస్టిగేషన్ పరికరాలు.. సైంటిఫిక్ పరికరాల ద్వారా క్రైం సీన్ 3డీ-3డీ వీవేర్ తో క్యాప్చర్ చేసేలా టెక్నాలజీ తీసుకొచ్చింది. ఇక బాధితుల వాంగ్మలాన్ని వీడియో రికార్డు చేసి హ్యాష్ ట్యాగ్ వాల్యూతో పనిచేస్తుంది. దిశా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం 25 కేసులను ఏడు రోజుల్లోగా పూర్తి చేసింది.