Varla Ramaiah: గుడివాడలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు -వర్ల రామయ్య

సంక్రాంతి సంప్రదాయం ముసుగులో గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో, క్యాసినో, గేమ్స్, అర్ధనగ్న నృత్యాలు ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య.

Varla Ramaiah: గుడివాడలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు -వర్ల రామయ్య

Varla Ramaiah

Updated On : January 22, 2022 / 7:36 PM IST

Varla Ramaiah: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో, క్యాసినో, గేమ్స్, అర్ధనగ్న నృత్యాలు ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అబ్బురపడిపోయిందని, గుడివాడలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని అన్నారు.

ఈ నెల 17వ తేదీన కృష్ణా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు వర్ల రామయ్య. నిజ నిర్దారణ కమిటీగా వెళ్తే వైసీపీ నాయకులను వేలాది మందిని విచ్చలవిడిగా వదిలి మాపైనే కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మంత్రి కల్లు తాగిన కోతిలా మాట్లాడారని విమర్శించారు.

ECI Extends : ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలు కంటిన్యూ..

డీఐజీ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని, డీఐజీని కలవడానికి వస్తామని చెప్పినా డీఐజీ కలవలేదని అన్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోనే క్యాసినో నిర్వహించారని, ఈ వ్యవహారంపై సీఎం జగన్‌రెడ్డి స్పందించడం లేదన్నారు.