MLA Ketireddy Peddareddy : కాల్వ శ్రీనివాసులు అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది : ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

కాల్వ శ్రీనివాసులు ఎలాంటివారో తాడిపత్రి రాయదుర్గం ప్రజలందరికీ తెలుసన్నారు. తాడిపత్రిలో జేసీ.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

MLA Ketireddy Peddareddy : కాల్వ శ్రీనివాసులు అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది : ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

MLA Peddareddy

Updated On : July 14, 2023 / 5:49 PM IST

Ketireddy Peddareddy Comments Kalva Srinivasulu : జేసీ సోదరులు కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు టీడీపీ వారిపై దాడి జరిగినప్పుడు కాల్వ శ్రీనివాసులు ఎందుకు మాట్లాడలేదని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. త్రిశూల్ మైనింగ్ పరిశీలనకు వచ్చిన టీడీపీ నాయకులు జేసీ నివాసంలోనే భోజనం చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడని తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని చెప్పాల్సిందిపోయి తనపై వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు.

కాల్వ శ్రీనివాసులు ఎలాంటివారో తాడిపత్రి రాయదుర్గం ప్రజలందరికీ తెలుసన్నారు. తాడిపత్రిలో జేసీ.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. కాల్వ శ్రీనివాసులు అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెబితేనే కాల్వ శ్రీనివాసులు తన గురించి మాట్లాడుతారని ఆరోపించారు. “నా గురించి మాట్లాడితే మీ రాజకీయ జీవితం, బినామీల గురించి చిట్టా విపాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు.

Ambati Rambabu : పవన్ జీవితంలో అసెంబ్లీకి వెళ్ళలేడు.. చంద్రబాబును సీఎం చెయ్యలేడు : మంత్రి అంబటి రాంబాబు

“గతంలో తాడిపత్రి టీడీపీ నాయకులపై దాడులు జరిగినా కాపాడిన చరిత్ర మీకు లేదు, మీరందరూ కలిసినా నన్ను కట్టడిచేయలేరు.. మీరందరిని, మీ పార్టీ వారిని కట్టడి చేసే శక్తి భగవంతుడు నాకు ఇచ్చారు” అని తెలిపారు. “కాల్వ శ్రీనివాసులు ఇలాగే మాట్లాడితే మీ అవినీతిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చిన అధికారులు లాగానే మీ ఇంటికి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు” అని హెచ్చరించారు.