KA Paul : మోదీపై నేను పోటీ చేస్తా.. చిత్తుచిత్తుగా ఓడించి తెలుగోడి సత్తా ఏంటో చూపిస్తా : కేఏ పాల్

బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేసినా జనసేనకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

KA Paul : మోదీపై నేను పోటీ చేస్తా.. చిత్తుచిత్తుగా ఓడించి తెలుగోడి సత్తా ఏంటో చూపిస్తా : కేఏ పాల్

KA Paul

Updated On : December 20, 2023 / 3:12 PM IST

KA Paul contest against Modi : మోదీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే తాను మోదీపై పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. మోదీని చిత్తుచిత్తుగా ఓడించి తెలుగోడి సత్తా ఏంటో చూపిస్తానని ఛాలెంజ్ చేశారు. మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. 141 మంది ఎంపీలను ఎలా బీజేపీ సస్పెండ్ చేస్తుందని ప్రశ్నించారు.

తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి, తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందని పేర్కొన్నారు. దానికి ఉదాహరణ ఆసిఫాబాద్ ఓటర్లు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తమ అభ్యర్థికి 2500 ఓట్లకు పైగా వచ్చాయని తెలిపారు. ఇప్పటికైనా జనసేన సైనికులు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలన్నారు. బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేసినా జనసేనకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఈటల

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో వంద, రెండు వందల ఓట్లతో గెలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మూడు నెలల్లో నెరవేర్చకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవదని, సోనియా గాంధీ నిల్చున్నా కూడా గెలవదన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 170 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

టీడీపీ ఎంపీ సీటుకు రూ.50 కోట్లు అడుగుతున్నారట.. రూ.50 లక్షలతో సభ పెట్టి తాను ఎంపిగా చేస్తానని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పది వేలమంది నిరుద్యోగులతో సభలు పెడతానని తెలిపారు. గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని, వైఎస్ జగన్ ని పిలుస్తానని చెప్పారు.