Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఈటల రాజేందర్

ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుణ్ణి ఓడించాలని అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో విష ప్రచారం చేశారని వెల్లడించారు.

Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఈటల రాజేందర్

Etela Rajender

Updated On : December 20, 2023 / 3:28 PM IST

Etela Rajender : పార్టీ ఆదేశం మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీజేపీ ప్రజలను చైతన్య పరిచిందన్నారు. కష్టపడింది బీజేపీ కానీ, లబ్ధి పొందింది కాంగ్రెస్ అని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనేనని కాంగ్రెస్ విష ప్రచారం చేసిందన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్ అణచివేత, నియంతృత్వ పోకడలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు.

ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుణ్ణి ఓడించాలని అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో విష ప్రచారం చేశారని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలు బీఆర్ఎస్ చేసిన విష ప్రచారం ప్రజలు నమ్మారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. రాజకీయ ఎత్తుగడలు చేయడంతో పాటు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కూడా కుట్రలు చేసి ఉంటారని విమర్శించారు.

తాను బలంగా ఎదుగుతున్నానని తన ఎదుగుదల అడ్డు కలుగుతుందని భావించిన వారు కూడా కుట్రలు చేశారని ఆరోపించారు. డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా అన్ని గ్రహించుకుని భవిష్యత్ కోసం పని చేయాలన్నారు. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని, వాటిని గ్రహించి ధర్మం, న్యాయం గెలుపు కోసం పని చేయాలని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

Also Read: మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. కొడుకు, కుమార్తెను అభినందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసిన షర్మిల

న్యాయాన్ని, ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకున్న తప్ప మరొకటి తనకు తెలియదన్నారు. ఒకరిపై ఫిర్యాదులు చేయడం, చాడీలు చెప్పడం తనకు తెలియదన్నారు. మంచి కోసం, పార్టీ ఎదుగుదల కోసం పని చేస్తా తప్ప మరొకటి లేదన్నారు. తనపై అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. తనపై తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తున్న వారికి తన పని తనమే సమాధానం చెబుతుందన్నారు.