Pawan Kalyan : పవన్ కల్యాణ్‌పై పోటీకి రెడీ అంటున్న మంత్రి
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై పోటీకి రెడీ అంటున్నారు మంత్రి.

Contest Against Pawan Kalyan, says Minister Karumuri Nageswararao
Pawan Kalyan : ఏపీలో ముందస్తు ఎన్నికల అంశంపై హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనే ఎక్కువ ఫోకస్ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ జనసేన అధినే పవన్ కల్యాణ్ పై ఫోకస్ ఎక్కువ పెట్టింది. పవన్ పర్యనల నుంచి ఆయన ఎన్నికల కోసం తయారు చేసుకున్న ‘వారాహి’వాహనం వరకు పవన్ పైనే దృష్టి పెట్టింది. పవన్ పైనే విమర్శలు చేస్తోంది. ఈక్రమంలో పవన్ ఎక్కడనుంచి పోటీ చేస్తారు?అనేది హాట్ టాపిక్ గా మారిన తరుణంలో పవన్ కల్యాణ్ పై పోటీకి నేను రెడీ అంటే నేను రెడీ అంటూ వైసీపీ నేతలు తెగ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ పై పోటీకి నేను రెడీగా ఉన్నానంటూ వైసీపీ నేత సినినటుడు అలీ ప్రకటించారనే ప్రచారం నడుస్తోంది. ఈక్రమంలో పవన్ కల్యాణ్ తణుకు నుంచి పోటీ చేస్తే ఆయనపై పోటీకి నేను రెడీగా ఉన్నానంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా అందరు వైసీపీ నేతల్లాగే కారుమూరి కూడా పవన్ పై విమర్శలు, ఎద్దేవాలు చేస్తుంటారు. ఈక్రమంలో పవన్ పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు నుంచి పోటీ చేస్తే నేను రెడీ అంటూ ప్రకటించారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ
ఈ సందర్భంగా కారుమూరి టీడీపీ, జనసేన పొత్తు గురించి కూడా విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా వైసీపీదే విజయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని..పథకాల లబ్దదారులే మా ఓటు బ్యాంకు అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికే పవన్ యత్నిస్తున్నారని..జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తులు అంటున్నాయని అన్నారు. కానీ, వైసీపీ మాత్రం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని అయిన గెలిచి తీరుతామంటున్నారు మంత్రి కారుమూరి. ఇలా ఎవరి ధీమాలు వారికి ఉంటే మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ పర్యటనలు చేసినా..సభలు నిర్వహించినా వైసీపీ నేతలు పవన్ పైనే ఫోకస్ పెడుతుంటారు. ఇలా సభలు, పర్యటనలు పూర్తి కాకుండానే పవన్ చేసే విమర్శలపై కౌంటర్ ఇవ్వటానికి రెడీగా ఉంటారు. కాగా..వైసీపీ నేతలు ముఖ్యంగా మంత్రులు విపక్షాలను..ముఖ్యంగా పవన్ కల్యాణ్, చంద్రబాబుని తిట్టటానికి మాత్రమే ప్రెస్ మీట్ పెడతారు తప్ప వారి శాఖల గురించి పనితీరు గురించి చెప్పటానికి కాదనే విమర్శలున్నాయి. ఇంకా చెప్పాలంటే కొంతమంది మాత్రం కొత్తగా బూతులు నేర్చుకోవాలంటే వైసీపీ నేతల నుంచే నేర్చుకోవాలని కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. అధికార పార్టీ నేతల తిట్లు..ప్రతిపక్షాల విమర్శలతో ఏపీలో నిరంతర హీట్ కొనసాగుతోంది.