Indrakeeladri EO Transfer : ఇంద్రకీలాద్రి ఈవో సురేశ్ బాబుపై బదిలీ వేటు

ఇంద్రకీలాద్రి ఈవో సురేశ్ బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన్ను రాజమండ్రి ఆర్జేసీగా దేవాదాయశాఖకు బాబు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Indrakeeladri EO Transfer : ఇంద్రకీలాద్రి ఈవో సురేశ్ బాబుపై బదిలీ వేటు

Indrakeeladri Eo Suresh Babu Transfered

Updated On : April 7, 2021 / 9:49 PM IST

Indrakeeladri EO Suresh Babu Transfered : ఇంద్రకీలాద్రి ఈవో సురేశ్ బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన్ను రాజమండ్రి ఆర్జేసీగా దేవాదాయశాఖకు బాబు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గగుడిలో ఏసీబీ, విజిలెన్స్ రైడ్స్ నేపథ్యంలో సురేశ్ బాబును బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. దుర్గగుడి నూతన ఈవోగా డి.భ్రమరాంబను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

2019లో దుర్గగుడి ఈవోగా సురేశ్ బాబు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన నియామకం నుంచే ఇంద్రకీలాద్రిపై అనేక వివాదాలు నెలకొన్నాయి. ఆయన క్యాడర్ కు సంబంధించి ఈవో పోస్టుకు అర్హడు కాదంటూ కొంతమంది కోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత ఆర్జేసీగా ప్రమోషన్ రావడం, ఇతరత్రా జరిగిన పరిణామాల నేపథ్యంలో దాదాపు 17 నెలల కాల వ్యవధిలో అనేక అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈనేపథ్యంలో ఏసీబీ అధికారులు మూడు రోజులపాటు ఇంద్రకీలాద్రిపై తనిఖీలు చేసిన తర్వాత ప్రాథమికంగా రిపోర్టు ఇచ్చారు. ప్రాథమికంగా రిపోర్టు ఆధారంగా ఇంద్రకీలాద్రిపై దాదాపు 15 మంది ఉద్యోగులపై వేటు పడింది. తర్వాత విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలకు సంబంధించి ప్రాథమిక రిపోర్టు ఇచ్చారు. దేవాదాయ కమిషన్ కు ఎటువంటి సంబంధం లేకుండా కాంట్రాక్టర్ కు డబ్బులు చెల్లించినట్లుగా అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ఇచ్చారు.