ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. అదానీ, టాటా, రిలయన్స్ బాటలో మరో ప్రముఖ సంస్థ..

రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రముఖ, పెద్ద సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. అదానీ, టాటా, రిలయన్స్ బాటలో మరో ప్రముఖ సంస్థ..

Updated On : November 13, 2024 / 9:58 PM IST

Jindal Group : ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాగుతోంది. ఇప్పటికే ఏపీలో భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు అదానీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ ముందుకు రాగా తాజాగా జిందాల్ గ్రూప్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును అసెంబ్లీలో కలిశారు శ్రద్ధా జిందాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపారు.

ప్రముఖ, పెద్ద కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామిక కంపెనీలకు చెందిన నేతలు ఏపీ వైపు, రాజధాని అమరావతి వైపు చూస్తున్నారు. 24 గంటల క్రితమే.. ఏపీలో దాదాపు రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ముందుకు రావడం, అందుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రద్ధా జిందాల్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత తెలిపారు. పెట్టుబడులు పెట్టే అంశంపై సీఎం చంద్రబాబు, శ్రద్దా జిందాల్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏపీలో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు సుముఖంగా ఉన్నాయి.

తాజాగా జిందాల్ గ్రూప్ కూడా ఈ జాబితాలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్డీయే కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ అమలు దిశగా చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపి ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేలా చూస్తోంది. రిలయన్స్ పెట్టుబడులతో ఏపీలో దాదాపు 2.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.

ఇప్పుడు జిందాల్ గ్రూప్ సైతం పలు రంగాల్లో ఏపీలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ పెట్టుబడులతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని, రాష్ట్రం అభివృద్థి పథంలో దూసుకెళ్తుందని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. కాగా, రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రముఖ, పెద్ద సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read : ఆపరేషన్ రాంగోపాల్ వర్మ..! అరెస్ట్ ఖాయమా? అప్పటి ఓవరాక్షన్‌కు ఇప్పుడు దెబ్బ పడబోతుందా?