మళ్లా ముఖ్యమంత్రి పదవి అవసరమా ? బాబు కీలక వ్యాఖ్యలు

మళ్లా ముఖ్యమంత్రి పదవి అవసరమా ? బాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu

Updated On : February 25, 2021 / 6:01 PM IST

Chandrababu In Chittur : ‘14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తనను..ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారో అందరికీ తెలుసు..ప్రతిపక్షంలో ఉన్న తనను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు..ఎవరికోసం పడుతున్నా..నా కోసమా ? నాకు మరోసారి ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2021, ఫిబ్రవరి 25వ తేదీ గురువారం చిత్తూరు జిల్లా గడుపల్లికి బాబు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి…మాట్లాడారు.
తాను పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదని, చక్కదిద్దాలనే ఉద్దేశ్యంతో కుప్పంని నిర్లక్ష్యం చేసినట్లు..కుప్పం కంటే పులివెందులకే నీళ్లు ఇచ్చానని చెప్పుకొచ్చారు.

24 గంటలూ ప్రజల కోసం ఆలోచించినట్లు, అందుకే అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామన్నారు. తన సమయంలో 85 శాతం మీకు ఇచ్చి ఉంటే..ఈ ఇబ్బందులు రాకుండా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం చేశారాయన. పొరపాటు జరిగింది..భవిష్యత్ లో జరగదని అనేకసార్లు చెప్పాన్ననారు.

ఇక పంచాయతీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు. కర్నాటక రాష్ట్రం నుంచి మనుషులను పిలిపించి ఓట్లు వేయించారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రాన్ని కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమని ఒప్పుకున్నారు. భవిష్యత్ లో మళ్లీ పొరపాటు జరగనివ్వని ఈ సందర్భంగా హామీనిచ్చారు. తనకు కూడా ఇదొక గుణపాఠమని అభివర్ణించారు. అవినీతి డబ్బులు సంపాదించుకోలేదు..అందుకే ఇబ్బందులు వచ్చాయి..విశ్వసనీయత..నైతిక విలువలున్నాయి..పోరాడుదామని చెబుతున్నట్లు