Pawan Kalyan : జనంలోకి జనసేనాని..ఏపీలో అక్టోబర్ 5 నుంచి పవన్ పర్యటన

తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు పవన్ పర్యటకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు జనసేనాని పర్యటన మొదలు పెట్టనున్నారు.

Pawan Kalyan : జనంలోకి జనసేనాని..ఏపీలో అక్టోబర్ 5 నుంచి పవన్ పర్యటన

Pawan Kalyan

Updated On : June 10, 2022 / 6:17 PM IST

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. ఏపీలో అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పర్యటించనున్నారు.

తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు పవన్ పర్యటకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు జనసేనాని పర్యటన మొదలు పెట్టనున్నారు.

pawan kalyan: వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి: పవన్ కళ్యాణ్

ఈ మేరకు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఏపీ టూర్ ను ప్రకటించారు. మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని మనోహర్ చెప్పారు. జనసైనికులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

6నెలల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా పర్యటించనున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటన ఉండేలా షెడ్యూల్ చేశారు. ఎన్నికలకు జనసైనికులు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.