Pawan Kalyan: పాలకుల వల్లే రాష్ట్రానికి శాశ్విత రాజధాని లేదు -పవన్ కళ్యాణ్

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Pawan Kalyan: పాలకుల వల్లే రాష్ట్రానికి శాశ్విత రాజధాని లేదు -పవన్ కళ్యాణ్

Pawan Kalyan (2)

Updated On : November 1, 2021 / 4:53 PM IST

Pawan Kalyan: ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్వతంత్ర భారత దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమని గుర్తుచేశారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణను ఎవరం మరువకూడదని అన్నారు పవన్ కళ్యాణ్.

పొట్టిశ్రీరాములు త్యాగాలను, అందించిన స్ఫూర్తిని భావితరాలకు తెలియచేయడం ప్రతిఒక్కరి బాధ్యతయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంధర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి సొంత రాజధాని లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి ఇప్పటికీ శాశ్వత రాజధాని లేకపోవడం పాలకుల లోపభూయిష్ట విధానాల ఫలితమేనని అన్నారు. శాశ్వత రాజధానితో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమన పథంలో పయనించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు పవన్ కళ్యాణ్.