Pawan Kalyan: రాజోలు జనసేన టికెట్ కోసం పోటాపోటీ.. వీరిలో పవన్ ఎవరికి టికెట్ ఇస్తారు?

జనసేన అధినేత పవన్ ఏ సమీకరణాల ఆధారంగా సీటు కేటాయిస్తారన్న అంశం..

Pawan Kalyan: రాజోలు జనసేన టికెట్ కోసం పోటాపోటీ.. వీరిలో పవన్ ఎవరికి టికెట్ ఇస్తారు?

JanaSena

రాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది.. సర్వేలు అన్నీ నాకు సానుకూలంగా ఉన్నాయి నాకు అవకాశం దక్కుతుందని ఒకరు, అధినేత నాకు దగ్గరగా ఉన్నారని మరొకరు, నేను గెలిచే అభ్యర్థిని అని మరొకరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీకి మధ్య అభినాభావ సంబంధం ఉంది.. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే జనసేన పార్టీ జనసేన ఏకేక స్థానం రాజోలు నియోజకవర్గం.. ఈ ప్రాంత ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుణపడి ఉన్నానని పలుమార్లు చెప్పిన సందర్భాలు లేకపోలేదు.. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ పోటీ చేయబోతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు..

అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలిచి అధికార వైసీపీ పార్టీకి పరోక్షంగా వెళ్లిపోయిన ఎమ్మెల్యేనే తిరిగి అదే జనసేన పార్టీ అభ్యర్థి ఓడించేందుకు రాజోలు నియోజకవర్గంలో జనసైనికులు కంకణం కట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో రాజోలు నియోజకవర్గం లో జనసేన పార్టీలో పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది.. ఈ నియోజకవర్గ నుండి ముగ్గురు అభ్యర్థులు బరులోకి దిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.. ఆ ముగ్గురు అభ్యర్థులు సీటు నాకే వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు…

రాజోలు నియోజకవర్గం లో చింతలరి గ్రామ సర్పంచ్ గా ఉన్న రాపాక రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. రమేష్ బాబు వైద్యు వృత్తిలో ఉండి స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.. గత మూడు సంవత్సరాల నుంచి జనసైనికులను బలోపేతం చేస్తూ పార్టీ కార్యక్రమాలను పాల్గొని కేడర్ని కలుపుకుని వెళ్తున్నారు.. కోవిడ్ సమయంలో రాజోలు నియోజకవర్గం లో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు.

సర్వేలు నాకు సానుకూలంగా ఉంటాయి కచ్చితంగా నాకు సీట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.రాజోలు నుండి పోటీ చేసేందుకు దేవ వరప్రసాద్ సిద్ధమవుతున్నారు.. వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా ముందుకు వెళ్తున్నారు.

రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.. సొంత గ్రామం రాజోలు నియోజకవర్గం లో ఉండడంతో ఇక్కడ నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.. మరొక అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి వాటిని చెంది జనసేన పార్టీలో చేరారు.. పార్టీలో తన క్యాడర్ తో పాటు జనసేన కూడా కలుపుకొని వెళ్తున్నానని కచ్చితంగా నాకు సీట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి జనసైనికుల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే తమ పై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని జనసైనికులు ఓపోతున్నారు.. ఆ కష్ట సమయంలో జనసైనికులు తోడుండి నడిపించి , పార్టీ క్యాడర్ని గాని జనసైనికులకు అండగా నిలిచిన వారికే అధినేత పవన్ కళ్యాణ్ సీటు ఇస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

రాజోలు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నీ గెలిపించి తీరుతామని కంకణం కట్టుకుని జనసైనికులు పనిచేస్తున్నారు.. సీటు అవకాశం దక్కితే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రోజు రోజుకి ఆశావాహులు సంఖ్య పెరిగిపోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ సమీకరణాల దృష్ట్యా సీటు కేటాయిస్తారా అనే అంశం మాత్రం వేచి చూడాల్సిందే మరీ.

Read Also: సంచలన నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ