మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్య ప్రసాద్‌కు జోగి రమేశ్ బాధితుడి ఫిర్యాదు

తనకు ఫోన్ చేయించారని, 15 లక్షల రూపాయలు ఇస్తేనే సమస్యను పరిష్కారిస్తామని అన్నారని తెలిపారు. డబ్బులు ఇచ్చాక ఫోన్..

మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్య ప్రసాద్‌కు జోగి రమేశ్ బాధితుడి ఫిర్యాదు

Jogi Ramesh

Updated On : July 8, 2024 / 6:10 PM IST

Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్‌కు మాజీ మంత్రి జోగి రమేశ్ బాధితుడు రంగబాబు ఫిర్యాదు చేశారు. పెడన నియోజక వర్గం, కృత్రివెన్వు మండలంలోని తన పొలంలో వివాదం సృష్టించి.. తనను బెదిరించి డబ్బలు వసూలు చేస్తున్నారని చెప్పారు.

కృత్రివెన్వు గ్రామంలో తాను పొలం అమ్ముతున్న విషయాన్ని తెలుసుకున్న జోగి రమేశ్ దాన్ని ఉద్దేశపూర్వకంగా వివాదంలో పెట్టించారని తెలిపారు. తాను నాటి ఎమ్మార్వోను కలిశానని, తన పొలం ఎందుకు వివాదంలోకి వెళ్లిందని అడిగానని చెప్పారు. దీంతో వెళ్లి జోగి రమేశ్‌ను కలవాలని నాటి ఎమ్మార్వో చెప్పారని అన్నారు.

తన సన్నిహితులు కొందరితో కలిసి జోగి రమేశ్‌ను కలిశానని తెలిపారు. తమ సమస్యను పరిష్కరిస్తానని అప్పట్లో జోగి రమేశ్ హామీ ఇచ్చారని అన్నారు. రెండు రోజుల తర్వాత తన అనుచరుడు శ్రీనివాసరెడ్డితో తనకు ఫోన్ చేయించారని, 15 లక్షల రూపాయలు ఇస్తేనే సమస్యను పరిష్కారిస్తామని అన్నారని తెలిపారు. దీంతో చివరకు రూ.15 లక్షలు వారికి ఇచ్చానని తెలిపారు.

Also Read: గత వైసీపీ ప్రభుత్వ ఇసుక విధానాలను రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అనంతరం మూడు నెలల వరకు శ్రీనివాసరెడ్డి ఫోన్ ఎత్తలేదరని అన్నారు. దీంతో శ్రీనివాసరెడ్డి చేసిన మోసంపై ప్రెస్ మీట్ పెడతామని హెచ్చరిస్తే అప్పుడు సమస్యను పరిష్కరించారని, మళ్లీ ఇప్పుడు మరికొంత భూమిపై కన్ను వేశారని తెలిపారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జోగి రమేశ్‌కు బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. బాధితుడు రంగబాబు సమస్యను పరిష్కరిస్తామని నారా లోకేశ్, అనగాని సత్య ప్రసాద్ హామీ ఇచ్చారని చెప్పారు.