KS Jawahar Reddy: ఏపీ కొత్త సీఎస్‌గా కేఎస్.జవహర్ రెడ్డి.. పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్.జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ ఈ నెల 30, బుధవారం రిటైర్ అవుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కేఎస్.జవహర్ రెడ్డిని ఎంపిక చేశారు.

KS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్.జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ బుధవారం (నవంబర్ 30న) రిటైర్ అవుతున్నారు.
YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు
దీంతో ఆయన స్థానంలో జవహర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈయన డిసెంబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవి కోసం పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ, చివరకు జవహర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈయన 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం జవహర్ రెడ్డి సీఎం ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అంతకుముందు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కూడా పని చేశారు. కొత్త సీఎస్‌గా ఎంపికైన జవహర్ రెడ్డి 2024 జూన్ వరకు పదవిలో ఉండే అవకాశం ఉంది. ఇక కొత్త సీఎస్ నియామకంతోపాటు పలువురు ఐఏఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్
జవహర్ రెడ్డి స్థానంలో సీఎం ముఖ్య కార్యదర్శిగా పూనం మాలకొండయ్యను ఎంపిక చేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూధన్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ఆండ్‌బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, హౌజింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్ నియమితులయ్యారు.