Kaile Anil Kumar: ఏపీ శాసనసభ హామీల కమిటీ చైర్మన్‌గా కైలే అనిల్ కుమార్
శాసనసభలో మంత్రులు ఇచ్చిన హామీల అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

Kaile Anil Kumar MLA Pamarru
Kaile Anil Kumar – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ హామీల కమిటీ ఛైర్మన్‌గా పామర్రు (Pamarru) ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ (YSRCP ) ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కైలే అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి ఇవాళ బులెటిన్ విడుదల చేశారు.
శాసనసభలో మంత్రులు ఇచ్చిన హామీల అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, అన్నాబత్తుని శివకుమార్, కె.భాగ్యలక్ష్మి, మేడా మల్లికార్జునరెడ్డి, కె.శ్రీనివాసరావు, రామకృష్ణ బాబు ఉన్నారు.
తనకు అవకాశం కల్పించిన సభా నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాంకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కైలే అనిల్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సభా హక్కుల కమిటీ, అసెంబ్లీ జాయింట్ కమిటీలను నియమించిన విషయం తెలిసిందే. సభా హక్కుల కమిటీ ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి నియమితుడయ్యారు.
East Godavari: వైసీపీలో శ్రుతిమించుతున్న గ్రూపుల గొడవలు.. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో..