చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, జగన్ అమ్మాలని చూస్తున్నారు : రాజధానిపై కన్నా
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ముగిసింది. గంట పాటు ఆయన మౌన దీక్ష చేశారు. రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కన్నా దీక్ష

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ముగిసింది. గంట పాటు ఆయన మౌన దీక్ష చేశారు. రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కన్నా దీక్ష
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ముగిసింది. గంట పాటు ఆయన మౌన దీక్ష చేశారు. రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కన్నా దీక్ష చేశారు. కన్నాతో పాటు బీజేపీ నేతలు, రైతులు దీక్షలో పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై కన్నా ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
టీడీపీ ప్రభుత్వం రాజధానిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని ఆరోపించిన కన్నా.. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని అమ్మాలని చూస్తోందన్నారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన రాక్షస పాలనను తలపిస్తోందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వాపోయారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్న కన్నా.. పరిపాలన వికేంద్రీకరణను మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.