నూజివీడులో దేవాలయ భూముల కబ్జా ఆరోపణలపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ

కృష్ణా జిల్లా నూజివీడులో దేవాలయాలకు చెందిన 90ఎకరాల భూములను ఏపీ బీజేపీ చీఫ్ కన్నా

  • Published By: naveen ,Published On : May 27, 2020 / 12:42 PM IST
నూజివీడులో దేవాలయ భూముల కబ్జా ఆరోపణలపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ

Updated On : May 27, 2020 / 12:42 PM IST

కృష్ణా జిల్లా నూజివీడులో దేవాలయాలకు చెందిన 90ఎకరాల భూములను ఏపీ బీజేపీ చీఫ్ కన్నా

కృష్ణా జిల్లా నూజివీడులో దేవాలయాలకు చెందిన 90ఎకరాల భూములను ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చాయని, దీనిపై విచారణ జరిపిస్తామని, అతి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ ఆరోపణలపై బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. టెన్ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఆయన భూకబ్జా ఆరోపణలను కొట్టిపడేశారు. నూజివీడులోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా దేవాలయాలకు చెందిన సెంటు భూమిని అయినా తాను కబ్జా చేసి ఉంటే, వెంటనే దాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఒకవేళ తాను కబ్జా చేసినట్టు వివరాలు ఉంటే ఇంకా ఇంతవరకు ఎందుకు హ్యాండోవర్ చేసుకోలేదని మంత్రి వెల్లంపల్లిని కన్నా లక్ష్మీనారాయణ అడిగారు. 

కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్:
* నాపై వచ్చినవి తీవ్రమైన ఆరోపణలు ఏమీ కాదు
* నేను మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ వాళ్లు నాపై భూకబ్జా ఆరోపణలు చేశారు.
* నూజివీడులో 90 ఎకరాలు దేవాలయ భూములు నేను కబ్జా చేసినట్టు ఓ న్యూస్ చానల్ లో స్టోరీలు ఇచ్చారు.
* ఆ తర్వాత ఆ న్యూస్ చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.
* న్యూస్ చానల్ లో పని చేసే వ్యక్తి తప్పు చేశాడని యాజమాన్యం వివరణ ఇవ్వడం జరిగింది.
* నేను భూకబ్జా చేసిన అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆరోపించారు.
* భూకబ్జా ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ అప్పటి సీఎం రోశయ్యకు లెటర్ ఇచ్చాను.
* ఆ తర్వాత మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంది.
* నాపై వచ్చిన దేవాలయ భూముల కబ్జా ఆరోపణలపై విచారణ జరిపించాలని అప్పటి సీఎం చంద్రబాబుని కూడా డిమాండ్ చేశాను.
* టీడీపీ ఓ గాలి పార్టీ, దాన్ని కన్నా అధ్వాన్నంగా వైసీపీ తయారైంది.
* మంత్రిగా ఉండి ఆరోపణలు చేయడం దారుణం.
* దేవాలయ భూములు ఆక్రమించుకుని ఉంటే తీసుకోకుండా ఎవడు ఆపాడు మిమ్మల్ని.
* నా ఆధీనంలో ఒక్క సెంటు భూమి ఉన్నా వాటిని వెనక్కి తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు ఆపారు, ఎవరు అడ్డుకున్నారో చెప్పండి.
* నూజివీడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే దేవాలయాలకు చెందిన ఒక్క సెంటు భూమిని ఆక్రమించికున్నట్టు రికార్డులు ఉంటే దాన్ని హ్యాండోవర్ చేసుకోకుండా ప్రభుత్వాన్ని ఎవరు ఆపారు.
* ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఈ తరహా ఆరోపణలు చేయడం అతడి చేతకానితనమే.
* కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడైనా దేవాలయానికి చెందిన ఒక్క సెంటు భూమి ఆక్రమించుకున్నట్టు చేసినట్టు నిరూపించండి.
* భూకబ్జా ఆరోపణలను కొట్టిపారేసిన కన్నా.
* ఒక మంత్రి ఇలాంటి ఆరోపణలు చేశాడంటే అది ఆయన చేతకానితనమే.
* నాపై వచ్చిన ఆరోపణలు కొత్తేమీ కాదు, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు.
* గతంలో సీఎంగా ఉన్న రోశయ్యను ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుని విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేశాను.
* వెల్లంపల్లి శ్రీనివాస్ స్థాయికి నన్ను దిగజార్చారు.