Kethireddy: చంద్రబాబు విషయంలో లోకేశ్ కంటే పవన్ కల్యాణ్ ఎక్కువ చేస్తున్నారు: కేతిరెడ్డి సెటైర్లు

చంద్రబాబు చేస్తున్న మాయలు సీనియర్ ఎన్టీఆర్ పాతాళ భైరవి సినిమాను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Kethireddy: చంద్రబాబు విషయంలో లోకేశ్ కంటే పవన్ కల్యాణ్ ఎక్కువ చేస్తున్నారు: కేతిరెడ్డి సెటైర్లు

Kethireddy

Updated On : September 10, 2023 / 5:02 PM IST

Kethireddy – Chandrababu Naidu: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి విషయంలో ఆయన కుమారుడు నారా లోకేశ్ (Nara Lokesh)  కంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan  ఎక్కువ చేస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి అరెస్ట్ అయినా పవన్ కల్యాణ్ ఇంతగా స్పందించరేమోనని సెటైర్లు వేశారు. చంద్రబాబు దేశంలోని ఏ వ్యవస్థనైనా నియంత్రించగలరని చెప్పారు. ఆయనపై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ ఆయన ఒ‍క్కసారి కూడా అరెస్ట్ కాలేదంటే వాటిని ఎంతలా మ్యానేజ్ చేశారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న మాయలు సీనియర్ ఎన్టీఆర్ పాతాళ భైరవి సినిమాను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇది ఒక వ్యక్తి అరెస్టుకు సంబంధించిన విషయం కాదని చెప్పారు. అవినీతి జరిగిందని అన్నారు. అప్పట్లో రూ.370 కోట్లకు సంబంధించిన ఎటువంటి వివరాలు లేకుండా జీవో ఇచ్చారని చెప్పారు. 90 శాతం వాటా నుంచి ఒక్క రూపాయికి కూడా రాలేదని అన్నారు.

Chandrababu Naidu Arrest: ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించిన చంద్రబాబు నాయుడు