AP Cabinet : వారికి ఉచిత విద్యుత్, ఆ జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లు- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet : వారికి ఉచిత విద్యుత్, ఆ జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లు- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Meeting

Updated On : March 17, 2025 / 6:32 PM IST

AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధానిలో భూకేటాయింపులకు సoబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read : దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థల పాత్రపై పాడ్‌కాస్ట్‌లో మోదీ ఏమన్నారంటే..?

చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఓకే చెప్పింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.