నిమ్మగడ్డ రమేష్ మరికొన్ని నెలలే ఉంటారు, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏమీ చెయ్యలేరు

kodali nani: ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ తాను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదని తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ మరికొన్ని నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఆయన ఏమీ చేయలేరని అన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే కచ్చితంగా ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందే అని తేల్చి చెప్పారు. కరోనావైరస్ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం నడుచుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎక్కువమందిని తరలించడం సాధ్యం కాదన్నారు మంత్రి కొడాలి నాని. కరోనా మహమ్మారి వల్ల ఎవరూ వచ్చే పరిస్థితి లేదన్నారు.
ప్రభుత్వాన్ని కాదని ఏమీ చెయ్యలేరు:
‘రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నిమ్మగడ్డ మరికొన్ని నెలలు మాత్రమే పదవిలో ఉంటారు. తర్వాత రిటైర్ అయ్యి హైదరాబాద్‌లో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం. నిమ్మగడ్డ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను.. నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చెయ్యలేరు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. అలా కాకుండా ఎన్నికల సంఘం నిర్వహిస్తానంటే జరిగే పనికాదు.
https://10tv.in/perni-nani-comments-on-heavy-fines/
కరోనా మహమ్మారి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం సాద్యం కాదు. ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కరోనా మహమ్మారి వల్ల ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. దసరా తర్వాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. బీహర్ ఎన్నికలతో స్థానిక సంస్థలు పోల్చకూడదు’ అని కొడాలి నాని అన్నారు.
ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలవుతుందా?
కరోనా కల్లోలం కారణంగా ఏపీలో స్థానిక ఎన్నికలు మార్చిలో ఆగిపోయాయి. ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలవుతుందా? ఆగిన చోటి నుంచే కొనసాగిస్తారా? లేక… కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్లు స్వీకరిస్తారా? ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందా? ఇలా ఎన్నె ప్రశ్నలు. మరోవైపు.. స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబర్ 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. అందుకే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అక్టోబర్ 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదంటూ వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు హీట్ ను మరింతగా పెంచుతున్నాయి.