Kottu Satyanarayana : బ్రతికున్నవారి ఓట్లు తొలగించాలనడం దారుణం.. చంద్రబాబు, లోకేష్ కి ఓట్లు అడిగే దమ్ము ఉందా? : కొట్టు సత్యనారాయణ

లోకేష్ చేసేది పాదయాత్ర కాదు గందరగోళం యాత్ర అని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర 200 రోజులైనా ఇంకా ఎన్ని రోజులైనా ప్రయోజనం లేదన్నారు.

Kottu Satyanarayana : బ్రతికున్నవారి ఓట్లు తొలగించాలనడం దారుణం.. చంద్రబాబు, లోకేష్ కి ఓట్లు అడిగే దమ్ము ఉందా? : కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana (1)

Updated On : August 31, 2023 / 12:05 PM IST

Kottu Satyanarayana – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రతికున్న వారి ఓట్లు తీసేయాలని తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేయడం దారుణం అన్నారు. గత ప్రభుత్వం హయాంలో బ్లూఫాగ్ అనే కంపెనీ ద్వారా 40లక్షల దొంగ ఓట్లు చేర్పించారని విమర్శించారు. ఈ దొంగ ఓట్లన్నీ ఎక్కడ తీసేస్తారేమోనని దొంగలాగా చంద్రబాబు ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్ళాడని ఎద్దేవా చేశారు.

ఎన్నికల కమిషన్ తన పని తన చేస్తుందని చెప్పారు. ఈ మేరకు గురువారం ఏలూరులో 10tvతో కొట్టు సత్యనారాయణ ప్రత్యేకంగా మాట్లాడారు. మాలోకం (లోకేష్) చేసేది పాదయాత్ర కాదు గందరగోళం యాత్ర అని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర 200 రోజులైనా ఇంకా ఎన్ని రోజులైనా ప్రయోజనం లేదన్నారు. లోకేష్ పాదయాత్రలో మాట్లాడే మాటలు 100 పేజీలు రాసుకున్నాడు అంట అధికారంలోకి వచ్చాక పని చూస్తాడు అంట ఏం చూస్తాడు..? అని ప్రశ్నించారు.

AP Deputy CM Comments : చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

2019లో పరిపాలన చూసి ఓట్లు వేయాలని అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్ కి ఉందా అని సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీస్తుందని అన్నవారు ఇప్పుడు అంతకుమించి ఉచిత పథకాలు ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఇసుకలో ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.

గతంలో ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇసుకలో పెద్ద ఎత్తున దోచుకున్నారని ఆరోపించారు. అబద్ధాల కోరు, దగా కోరు, మోసగాడు అని చంద్రబాబుకి ప్రజలు ముద్ర వేసారని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఇంటికి సాగనంపారని తెలిపారు.