విషాదం…రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : November 3, 2020 / 03:54 PM IST
విషాదం…రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

Updated On : November 3, 2020 / 4:02 PM IST

four members of family suicide : కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన నలుగురురైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం మండలం కొల్లూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి వీరు మరణించారు. భార్యా,భర్తతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వీరిని నంద్యాల రోజా కుంటకు చెందిన గఫార్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.



నంద్యాల నుంచి కొల్లూరుకు ఆటోలో వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

kurnool family suicide

kurnool family suicide 2