AP Cabinet Key Decisions : విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు, 2లక్షల ఇళ్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు

Ap Cabinet Key Decisions
AP Cabinet Key Decisions : సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
* టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి మంత్రివర్గం అంగీకారం.
* ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
* విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు గ్రీన్ సిగ్నల్.
* జేఎన్‌టీయూ చట్టం 2008 సవరణకు మంత్రివర్గం అంగీకారం.
* భూముల రీ సర్వేలో పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి ఏపీ భూహక్కు చట్ట సవరణకు ఆమోదం.
* విశాఖ నక్కపల్లి దగ్గర హెటిరో డ్రగ్స్ సెజ్‌కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 81 ఎకరాల భూకేటాయింపునకు అంగీకారం.
* 2021-24 ఐటీ విధానానికి మంత్రివర్గం ఆమోదం.