Srisailam: బాబోయ్ చిరుత.. శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో చిరుత సంచారం .. భయాందోళనలో యాత్రికులు

నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో చిరుత సంచారం యాత్రికులను భయాందోళనకు గురిచేస్తుంది. గతంలోకూడా ఈ ప్రాంతంలో అనేకసార్లు చిరుత పులులు సంచరించాయి.

Srisailam: బాబోయ్ చిరుత.. శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో చిరుత సంచారం .. భయాందోళనలో యాత్రికులు

Leopard In Srisailam

Updated On : December 31, 2023 / 1:15 PM IST

Leopard In Srisailam : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలంరేపింది. రత్నా నందస్వామి ఆశ్రమం వద్ద చిరుత సంచరిస్తున్నట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికులు, యాత్రికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అటవీశాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. అర్థరాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత పులి తిరుగుతుండటాన్ని కొందరు యాత్రికులు గుర్తించారు. శనివారం రాత్రి సమయంలో రత్నా నందస్వామి ఆశ్రమం దగ్గర గోడపై చిరుత కూర్చొని కనిపించింది. చిరుతను చూసిన స్థానికులు, యాత్రికులు సెల్ ఫోన్లలో ఫొటోలుతీశారు. కొందరు యాత్రికులు చిరుత ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Also Read : Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ‘సలార్’ సాంగ్ చూశారా.. సోషల్ మీడియాలో వైరల్.. కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఖుషీ..!

నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో చిరుత సంచారం యాత్రికులను భయాందోళనకు గురిచేస్తుంది. గతంలోకూడా ఈ ప్రాంతంలో అనేకసార్లు చిరుత పులులు సంచరించాయి. చిరుతలు, ఎలుగుబంట్లు దట్టమైన అటవీ ప్రాంతాలను వదిలి జనావాసాల్లోకి వస్తుండటంతో భక్తులు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి.. ఎక్కడైతే చిరుత పులులు, ఎలుగు బంట్లు తరచూ సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో రెడ్ జోన్ గా బోర్డులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అటవీ ప్రాంతాలను వదిలి జంతువులు జనావాసాల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని యాత్రికులు, స్థానికులు కోరుతున్నారు.