Nara Lokesh : చంద్రబాబుకు బెయిల్.. ఆనందంలో లోకేశ్, బ్రాహ్మిణి.. ఎయిర్ పోర్టు వద్ద వీడియో వైరల్
Chandrababu Interim Bail: చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన టీడీపీ నేతలు లోకేశ్, బ్రాహ్మిణిలకు తెలియజేశారు.

Nara Lokesh
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు ఆయన కుమారుడు నారా లోకేశ్, నారా బ్రాహ్మిణిలు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన టీడీపీ నేతలు లోకేశ్, బ్రాహ్మిణిలకు తెలియజేశారు. దీంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడేఉన్న కార్యకర్తలతో నారా లోకేశ్.. యుద్ధం ఇప్పుడు మొదలైంది అంటూ కామెంట్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది.
Also Read : చంద్రబాబు అరెస్టు నుంచి బెయిల్ వరకు.. ఎప్పుడు ఏం జరిగింది.. పూర్తి వివరాలు ఇలా..
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో నారా లోకేశ్, బ్రాహ్మిణిలు మంగళవారం ములాఖత్ కావాల్సి ఉంది. వారు మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. లోకేశ్ తో పాటు బ్రాహ్మిణి, ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి చంద్రబాబుతో ములాఖత్ అవుతారు. ఇదిలాఉంటే.. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం 4 గంటల తరువాత ఆయన బయటకు రానున్నారు. లోకేశ్, బ్రహ్మిణిలతో పాటు భారీగా తరలివస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబుకు జైలు వద్ద స్వాగతం పలకనున్నట్లు తెలుస్తోంది.