ప్రేమోన్మాది ఘాతుకం : ప్రేమకు నిరాకరించిందని అమ్మాయి ఇంటికి నిప్పు.. ఇద్దరు పిల్లలు సజీవదహనం

తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న కోపంతో ఆమె ఇంటికే నిప్పు పెట్టాడు ఓ ప్రేమోన్మాది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో ఈ దారుణం చోటు చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 02:51 AM IST
ప్రేమోన్మాది ఘాతుకం : ప్రేమకు నిరాకరించిందని అమ్మాయి ఇంటికి నిప్పు.. ఇద్దరు పిల్లలు సజీవదహనం

Updated On : January 22, 2020 / 2:51 AM IST

తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న కోపంతో ఆమె ఇంటికే నిప్పు పెట్టాడు ఓ ప్రేమోన్మాది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో ఈ దారుణం చోటు చేసుకుంది.

తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న కోపంతో ఆమె ఇంటికే నిప్పు పెట్టాడు ఓ ప్రేమోన్మాది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోనుందన్న కోపంతో.. అర్థరాత్రి ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సజీవ దహనం కాగా.. నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒక పాప, బాబు ఉన్నారు.

5

ఈ ఘటనతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఇద్దరు పిల్లలు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పిల్లలు ఏం పాపం చేశారని కంటతడి పెట్టారు. ప్రేమోన్మాది శ్రీనివాస్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పక్కా స్కెచ్ ప్రకారమే ఉన్మాది శ్రీనివాస్ దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.

దుళ్ల సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ కి వెళ్లిన ఉన్మాది అక్కడ పెట్రోల్ కొన్నాడు. మంగళవారం(జనవరి 21,2020) అర్థరాత్రి అమ్మాయి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇదే అదనుగా ఉన్మాది శ్రీనివాస్.. ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ప్రేమకు నిరాకరించడంతో పాటు మరో పెళ్లి చేసుకుంటుందనే కోపంతో శ్రీనివాస్ రగిలిపోయాడు. ఉన్మాది శ్రీనివాస్ బాధితుల సమీప బంధువే. అమ్మాయి తండ్రికి మేనల్లుడు అవుతాడు.

శ్రీనివాస్ పెట్రోల్ కొనుగోలు చేయడం బంకులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజీ ఆధారంగా శ్రీనివాసే ఈ పని చేశాడని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ కొంతకాలంగా ప్రేమ పేరుతో అమ్మాయిని వేధిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి అతడి ప్రేమను నిరాకరించింది. అమ్మాయికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

* తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో ప్రేమోన్మాది దారుణం
* ప్రేమించిన అమ్మాయి ఇంటికి నిప్పంటించిన యువకుడు
* ఇద్దరు పిల్లలు సజీవదహనం, నలుగురికి గాయాలు
* అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారన్న కారణంతో ప్రేమోన్మాది దాడి
* అర్థరాత్రి ఇంటికి నిప్పంటించిన ప్రేమోన్మాది