Women Police Uniform : పురుషులతో మహిళా పోలీసుల డ్రెస్ కొలతలు.. నెల్లూరులో వివాదం

నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు వివాదానికి దారి తీసింది. మహిళా పోలీసుల యూనిఫామ్ కోసం పురుషులు కొలతలు తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది.

Women Police Uniform : పురుషులతో మహిళా పోలీసుల డ్రెస్ కొలతలు.. నెల్లూరులో వివాదం

Women Police Uniform

Updated On : February 7, 2022 / 4:28 PM IST

Women Police Uniform : నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు వివాదానికి దారి తీసింది. మహిళా పోలీసుల యూనిఫామ్ కోసం పురుషులు కొలతలు తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఆత్మకూరు, కావలి డివజన్లలో యూనిఫామ్ కుట్టించే ప్రక్రియలో భాగంగా మగవారితో కొలతలు తీసుకున్నారు. దీనిపై సదరు మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ డ్రెస్ సైజులు మగవారు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

Brisk Walk : వేగవంతమైన నడకతో….. గుండె ఆరోగ్యం మెరుగు

ఆత్మకూరు, కావలి డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులకు కొత్త యూనిఫామ్ కోసం స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో కొలతలు తీసుకుంటున్నారు. కాగా, మగవారే మహిళల డ్రెస్ కొలతలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. మహిళా పోలీసుల డ్రెస్ కొలతలు తీసుకునేందుకు పురుష పోలీసులకు డ్యూటీ వేసినట్లు తెలిసింది. దీనిపై సదరు మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మగవారు కొలతలు తీసుకోవడంతో తాము చాలా ఇబ్బంది పడ్డామని లేడీ కానిస్టేబుళ్లు వాపోయారు.

Facebook: ఫేస్‌బుక్‌కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?

దీనికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో కొలతలు తీసుకుంటున్న తీరు వివాదానికి దారితీసింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. మహిళా పోలీసుల యూనిఫామ్ కు సంబంధించిన టైలర్ మెజర్ మెంట్స్ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ కు అప్ప చెప్పామని నెల్లూరు ఎస్సీ విజయా రావు తెలిపారు. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దాం అన్నారు.

మహిళా టైలర్లు.. మహిళా పోలీస్ సిబ్బంది కూడా వారిలోనే ఉన్నారని వెల్లడించారు. మహిళా పోలీసుల దుస్తుల కొలతలు తీసేందుకు మహిళలనే నియమించామని ఎస్పీ తెలియజేశారు. అంతేకాదు, అనుమతి లేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫోటోలు తీసి, మహిళల ప్రైవసీకి భంగం కలిగించిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశించారు ఎస్పీ.