సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు.. మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశించింది.

సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు.. మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు

YCP MLA Malladi Vishnu

ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. సూర్యనారాయణ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని, ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని తెలిపారు.

ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ఏపీలో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ శ్రేణులను వైసీపీపై గొడవలకు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

జగన్ పై దాడికి లోకేశ్ ప్రసంగం ద్వారా యువకులను ప్రేరేపితం చేశారని చెప్పారు. లోకేశ్ వ్యాఖ్యల వల్లే వైసీపీ నేత వెంకటరెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తామన్న సంస్కృతి చంద్రబాబుదని చెప్పారు. ఓటమి భయం వల్లే కుప్పంలో భువనేశ్వరి ప్రత్యేక మ్యానిఫెస్టో ప్రకటించారని తెలిపారు.

సూర్యనారాయణ పై నివేదిక ఇవ్వాలి: ఈసీ
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశించింది. సర్కారుకి అనుకూలంగా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా ఎన్నికల నియమావళి ఉల్లంఘన అనే చెప్పింది. సూర్యనారాయణతో సమావేశాలకు హాజరైన వారిపై, పత్రికలలో స్టేట్ మెంట్లు ఇచ్చిన ఉద్యోగులందరిపై నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. సర్కారుకి వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్యోగులందరిపై ఏయే చర్యలు తీసుకున్నారు వెంటనే తెలియజేయాలని చెప్పింది.

Harish Rao: దీని అర్థం మీ మ్యానిఫెస్టో తప్పు అనే కదా?: హరీశ్ రావు