భార్య ఫోన్ కు మిస్డ్ కాల్ : గొంతు పిసికి హత్య చేసిన భర్త

  • Published By: chvmurthy ,Published On : April 15, 2020 / 02:31 PM IST
భార్య ఫోన్ కు మిస్డ్ కాల్ : గొంతు పిసికి హత్య చేసిన భర్త

Updated On : April 15, 2020 / 2:31 PM IST

సంతోషంగా సాగిపోతున్న వారి కాపురంలో…. భార్య ఫోన్ కు వచ్చిన ఒక మిస్స్ డ్ కాల్ ఆమె చావుకు కారణమయ్యింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన బోడా సుబ్బారావు, కోటేశ్వరమ్మ భార్యాభర్తలు.వీరికి ముగ్గురు పిల్లలు. కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సుబ్బారావు భార్య కోటేశ్వరమ్మను వేధించటం మొదలు పెట్టాడు. 

అదే గ్రామానికి చెందిన వేరోకరితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను  సూటి పోటి మాటలతో బాధ పెట్టేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరుచూ గొడవలు  జరుగుతున్నాయి.  ఇదే విషయమై మంగళవారం, ఏప్రిల్14, రాత్రి  పెద్దల వద్ద పంచాయతీ కూడా జరిగింది. 

అయినప్పటికీ భార్య ఫోన్ కు ఒక నెంబరు నుంచి మిస్ డ్ కాల్ వచ్చింది.  అది గమనించిన సుబ్బారావు ఎవరు చేశారని భార్యతో గొడవకు దిగాడు. ఆమె ప్రియుడే ఫోన్ చేశాడని భావించి ఆమెను తీవ్రంగా కొట్టాడు.  అతనిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామని చెప్పి భార్యను తీసుకుని  బైక్ పై ఎక్కించుకుని పోలీసు స్టేషన్ కు బయలు దేరాడు.  

ఈలోగా ఆమె ప్రియుడని సుబ్బారావు భావిస్తున్న వ్యక్తి ఎదురు రావటంతో రోడ్డుపైనే భార్యను మరోసారి కొట్టాడు. దీంతో కోటేశ్వరమ్మ ఇంటికి తిరిగి వచ్చేసింది. వెనకనే ఇంటికి చేరుకున్న సుబ్బారావు ఆగ్రహంతో భార్యని మంచంపై పడేసి ఆమె చీర కొంగు, గొంతుకు బిగించి, ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి భార్యను హత్యచేశానని చెప్పి లొంగిపోయాడు.

Also Read | తెలుగు రాష్ట్రాల్లో కరోనా హాట్ స్పాట్‌లు ఇవే