మా మొదటి ప్రయారిటి జగన్.. రెండో ప్రాధాన్యత చంద్రబాబు: మందకృష్ణ

మా మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు. దామాషా ప్రకారం మాకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలి. 4 పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి.

మా మొదటి ప్రయారిటి జగన్.. రెండో ప్రాధాన్యత చంద్రబాబు: మందకృష్ణ

Manda Krishna Madiga seek Andhra Pradesh CM Jagan appointment

Updated On : January 11, 2024 / 1:32 PM IST

Manda Krishna Madiga : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడుతామని, ముందుగా ముఖ్యమంత్రి జగన్మోమోహన్ రెడ్డితో మాట్లాడాలనుకుంటున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై తాము ఇప్పటివరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండే పార్టీకే మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

”త్వరలో ముఖ్యమంత్రి జగన్ జగన్మోమోహన్ రెడ్డితో మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పటివరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండలేం. షెడ్యూల్ కులాల వర్గీకరణ, మాదిగల వర్గీకరణ అంశాలను ప్రధానంగా తీసుకుంటాం. ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తాం. రెండో ప్రాధాన్యత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇస్తాం. ప్రభుత్వంలో ఉన్న మా ఎస్సీ నాయకుల సహాయంతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకే ఈ సమావేశం పెట్టాం. జగన్ మమ్మల్ని దగ్గరకు తీసుకుంటే దగ్గరగా ఉంటాం, లేకుంటే దూరంగా ఉంటాం.

Also Read: అందుకే పవన్ అన్నను కలిశాను: అంబటి రాయుడు మరో ట్వీట్

మా మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు. ఈ నెల 17న సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై విచారణ జరగబోతుంది. అందుకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం తొందర పడుతున్నాం. సీఎం జగన్ త్వరగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలి. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సుప్రీంకోర్టులో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంపై విచారణ జరగబోతుంది. గతంలో వైయస్సార్ ఉన్న కాలంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే అప్పుడు మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మళ్లీ ఇప్పుడు రాజశేఖరరెడ్డి కుమారుడు ప్రభుత్వంలో ఉండగా విచారణకు వచ్చింది. ప్లీనరీలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని, నాన్న గారి ఆశయాలకు అనుకూలంగా ఉన్నానని జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. సుప్రీం కోర్టులో ప్రభుత్వం లాయర్ తో తమ వాదన వినిపించాలని కోరుతున్నాం.

Also Read: అంబటి రాయుడు జనసేనలో ఎన్ని రోజులు ఉంటారో, ఏం చేస్తారో చూద్దాం..

కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసే కసరత్తుకు మీరు ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుని, పార్టీ పరంగా లేఖ రాయాలి. మమ్మల్ని మిత్రులుగా చూడండి, వ్యతిరేకులుగా చూడకండి. రేపటి నుంచి 16వ తేదీ లోగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం. రాష్ట్రంలో మాదిగ రెల్లి కులాలు 50 శాతం ఉన్నారు. దామాషా ప్రకారం మాకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలి. నాలుగు పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలు మాకు కేటాయించాల”ని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.