ఏపీలో డ్వాక్రా సంఘాల్లా పురుషులకూ పొదుపు సంఘాలు.. మీరు చేరొచ్చా? లేదా? చేరితే ఎంత లాభం?

ఏపీలో పురుష సంఘాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.. విజయవాడ, విశాఖపట్టణంలో మూడు వేల సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్ లో..

ఏపీలో డ్వాక్రా సంఘాల్లా పురుషులకూ పొదుపు సంఘాలు.. మీరు చేరొచ్చా? లేదా? చేరితే ఎంత లాభం?

Mens Savings Societies

Updated On : February 6, 2025 / 9:56 AM IST

Mens Savings Societies: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. తద్వారా మహిళలకు ఎంతో మేలు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా డ్వాక్రా సంఘాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఇదే తరహాలో పురుషులకూ స్వయం ఉపాధి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పురుషులకూ పొదుపు సంఘాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్టణంలో మూడు వేల సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించనున్నారు. అయితే, గత నెలలో వెయ్యి సంఘాలు ఏర్పాటు కాగా.. మార్చి నెలాఖరు నాటికి మరో రెండువేల సంఘాల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు.

Also Read: Gold: వామ్మో.. బంగారం టన్నులు టన్నులు కొంటున్నారు.. డబ్ల్యూజీసీ నివేదికలో సంచలన విషయాలు

పురుషుల్లో పొదుపు అలవాటు చేయించాలన్న ఉద్దేశంతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ (ఎన్ యూఎల్ఎం) 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా ఏపీలో విజయవాడ, విశాఖపట్టణంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. గ్రామాల నుంచి నగరాలకు ఉపాధి కోసం తరలివస్తున్న కూలీలకు ఆర్థికంగా భరోసా కల్పించడమే. సంఘాల ఏర్పాటు ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటు చేయించడంతోపాటు బ్యాంకుల నుంచి రుణాలిప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

Also Read: AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛ‌న్‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..

భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు, జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం, కూరగాయలు, నిత్యావసర సరఫరా చేసే గిగ్ కార్మికులు, ఆటో, రిక్షా, తోపుడుబళ్ల కార్మికులు, వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో, ఇళ్లలో పనిచేసేవారు. వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు పురుషుల పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులు. ఒక్కో సంఘానికి గరిష్ఠంగా ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రతీనెలా సమావేశమై ఒక్కో సభ్యుడు కనిష్ఠంగా రూ.100 చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. మూడు నెలల తరువాత పొదుపు మొత్తంపై ఆరు రెట్లు లేదా రూ. 1.50 లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని కూడా పొందొచ్చు.

Also Read: Delhi Assembly Exit Polls : ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు?.. ఫుల్ డిటెయిల్స్

దేశ వ్యాప్తంగా 25 నగరాల్లో కేంద్రం పురుషుల పొదుపు సంఘాల కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది అమలు చేయనుంది. ఇందులో ఏపీ నుంచి విజయవాడ, విశాఖ పట్టణాలు ఉన్నాయి. అయితే, దశల వారిగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రెండో దశలో.. విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. అయితే, సంఘాల ఏర్పాటులో భాగంగా కార్మికుల గుర్తింపుకోసం ఆయా జిల్లాల్లో త్వరలో సర్వే నిర్వహించనున్నట్లు మెప్మా అధికారులు తెలిపారు.